అధిక్షేపం రెండు వైపులా పదునున్న చురకత్తి కూడా! ఏ మాత్రం పట్టు తప్పినా లక్ష్యం దెబ్బ తింటుంది. సంబంధం లేనివారిని గాయపరుస్తుంది, ప్రయోక్తను దోషిని చేస్తుంది. అధిక్షేప రచయితలు ప్రధానంగా అతివ్యాప్తి, అవ్యాప్తుల పాలబడకుండా ఎక్కువ మెలకువగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాల పట్ల స్పష్టమైన ఎరుక ఉన్న మోహన్ రుషి నూరు శాతం సఫలమైనారు. ఎవరిని ఎంచుకున్నాడో, వారి దిమాకులనే ఖరాబ్ చేశారు.
- పెన్నా శివరామకృష్ణ
మోహన్ రుషిలో ఒక పిచ్చివాడు, వేదాంతి, సిద్ధాంతి ఇంకా రకరకాల వ్యక్తులున్నారు. వాళ్ళంతా ఒకర్ని చూసి ఇంకొకరు నవ్వుకుంటూ, జాలిపడుతూ, కాసేపు సైనికుల్లా, మరికాసేపు ప్రేక్షకుల్లా వ్యవహరిస్తూ మాటలు రువ్వుకుంటూ ఉంటారు. అవి మనల్ని వింజామరలా నిమురుతాయి, తూటాల్లా తరుముతాయి.
- జి ఆర్ మహర్షి
అధిక్షేపం రెండు వైపులా పదునున్న చురకత్తి కూడా! ఏ మాత్రం పట్టు తప్పినా లక్ష్యం దెబ్బ తింటుంది. సంబంధం లేనివారిని గాయపరుస్తుంది, ప్రయోక్తను దోషిని చేస్తుంది. అధిక్షేప రచయితలు ప్రధానంగా అతివ్యాప్తి, అవ్యాప్తుల పాలబడకుండా ఎక్కువ మెలకువగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాల పట్ల స్పష్టమైన ఎరుక ఉన్న మోహన్ రుషి నూరు శాతం సఫలమైనారు. ఎవరిని ఎంచుకున్నాడో, వారి దిమాకులనే ఖరాబ్ చేశారు. - పెన్నా శివరామకృష్ణ మోహన్ రుషిలో ఒక పిచ్చివాడు, వేదాంతి, సిద్ధాంతి ఇంకా రకరకాల వ్యక్తులున్నారు. వాళ్ళంతా ఒకర్ని చూసి ఇంకొకరు నవ్వుకుంటూ, జాలిపడుతూ, కాసేపు సైనికుల్లా, మరికాసేపు ప్రేక్షకుల్లా వ్యవహరిస్తూ మాటలు రువ్వుకుంటూ ఉంటారు. అవి మనల్ని వింజామరలా నిమురుతాయి, తూటాల్లా తరుముతాయి. - జి ఆర్ మహర్షి© 2017,www.logili.com All Rights Reserved.