శ్రీ పిలకా గణపతిశాస్త్రి జననం తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో. సంస్కృతాంగ్లాలు క్షుణ్ణంగా చదివారు. సాహిత్య విద్యా ప్రవీణ ఇత్యాది పరీక్షల్లో ఉత్తీర్ణులు. సంస్కృతాంద్రోపాధ్యాయులుగా, పత్రికా సంపాదకులుగా పనిచేశారు. రాత్నోపహారము, మణిదీపిక, విభ్రాంతామరుకను అన్న కవితా సంపుటాలు, విశాలనేత్రాలు మొదలైన నవలలు, హరివంశము, దేవీభాగవతము మొదలయిన పౌరాణిక రచనలు వీరికి విశేషఖ్యాతిని కలిగించాయి. కల్హణ మహాకవి సంస్కృతంలో రచించిన రాజతరంగిణికి గణపతిశాస్త్రి గారి తెలుగు వచనానువాదం ఇది.
మొదటి గోనందుని నుండి హర్షుని వరకు కాశ్మీరాన్ని పరిపాలించిన రాజుల చరిత్ర రాజతరంగిణి. కల్హణుడు గొప్పకవి. ఈ చారిత్రిక కథనాన్ని చక్కని వర్ణనలు, ఆలంకారిక శైలితో సుందరకావ్యంగా తీర్చిదిద్దాడు. రాజతరంగిణి పూర్వరాజుల స్తోత్రపాఠం కాదు. ఇందులో అన్ని రకాల రాజులూ ఉన్నారు. ఉత్తములు, విజేతలు, మహాపండితులు, కవులు, ప్రజోపయోగ కార్య దురంధరులయిన రాజులతో పాటు, పిరికి పందాలు, నీచులు, స్వార్థపరులు, పరమ కిరాతకులు, లుబ్దులునైన రాజులూ ఉన్నారు. ఇటువంటి వారి దుశ్చరిత్ర వర్ణనను కూడా కల్హణుడు విడిచిపెట్టలేదు. ఆ విధంగా 'రాజతరంగిణి' నిష్పాక్షికత అనే చరిత్ర రచనా లక్షణాన్ని పుణికిపుచ్చుకుంది. ఏకైక మనదగిన ఒక మౌలిక చరిత్ర కావ్యం కల్హణ మహాకవి 'రాజతరంగిణి'ని మీ చేతుల్లో పెడుతున్నాం. ఆస్వాదించి ఆనందించండి.
శ్రీ పిలకా గణపతిశాస్త్రి జననం తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో. సంస్కృతాంగ్లాలు క్షుణ్ణంగా చదివారు. సాహిత్య విద్యా ప్రవీణ ఇత్యాది పరీక్షల్లో ఉత్తీర్ణులు. సంస్కృతాంద్రోపాధ్యాయులుగా, పత్రికా సంపాదకులుగా పనిచేశారు. రాత్నోపహారము, మణిదీపిక, విభ్రాంతామరుకను అన్న కవితా సంపుటాలు, విశాలనేత్రాలు మొదలైన నవలలు, హరివంశము, దేవీభాగవతము మొదలయిన పౌరాణిక రచనలు వీరికి విశేషఖ్యాతిని కలిగించాయి. కల్హణ మహాకవి సంస్కృతంలో రచించిన రాజతరంగిణికి గణపతిశాస్త్రి గారి తెలుగు వచనానువాదం ఇది. మొదటి గోనందుని నుండి హర్షుని వరకు కాశ్మీరాన్ని పరిపాలించిన రాజుల చరిత్ర రాజతరంగిణి. కల్హణుడు గొప్పకవి. ఈ చారిత్రిక కథనాన్ని చక్కని వర్ణనలు, ఆలంకారిక శైలితో సుందరకావ్యంగా తీర్చిదిద్దాడు. రాజతరంగిణి పూర్వరాజుల స్తోత్రపాఠం కాదు. ఇందులో అన్ని రకాల రాజులూ ఉన్నారు. ఉత్తములు, విజేతలు, మహాపండితులు, కవులు, ప్రజోపయోగ కార్య దురంధరులయిన రాజులతో పాటు, పిరికి పందాలు, నీచులు, స్వార్థపరులు, పరమ కిరాతకులు, లుబ్దులునైన రాజులూ ఉన్నారు. ఇటువంటి వారి దుశ్చరిత్ర వర్ణనను కూడా కల్హణుడు విడిచిపెట్టలేదు. ఆ విధంగా 'రాజతరంగిణి' నిష్పాక్షికత అనే చరిత్ర రచనా లక్షణాన్ని పుణికిపుచ్చుకుంది. ఏకైక మనదగిన ఒక మౌలిక చరిత్ర కావ్యం కల్హణ మహాకవి 'రాజతరంగిణి'ని మీ చేతుల్లో పెడుతున్నాం. ఆస్వాదించి ఆనందించండి.ఇది చాలా బాగుంది. గ్రాంథికంలో ఉండే పాత పుస్తకం ఇంకా బాగుంటుంది. నా చిన్నప్పుడు, 25 ఏళ్ళకింద చదివాను. ఎవరైనా ఏ గ్రంథాలయంలో ఉందో చెప్తే కృతజ్ఞతలు.
© 2017,www.logili.com All Rights Reserved.