శ్రమజీవుల స్వేద బిందువుకు వణిజుల వ్యవహారం తోడైనప్పుడే సంపద సృష్టి సంపూర్ణమవుతుందన్నది జగమెరిగిన సత్యం . దేశ ఆర్థికాభివృద్ధిలో వాణిజ్య సంస్థలది కీలక పాత్ర . దేశ సంపద సృష్టిలో వాణిజ్య సంస్ధల ఆలంబన కాదనలేనిది. ఉపాధి కల్పన , జీవన ప్రమాణాల మెరుగుదల వంటివి వ్యాపారం పరిపుష్టమైనప్పుడే సాధ్యం . ఆర్ధిక రంగం సుస్థిరం కావాలంటే సుదృఢమైన వ్యాపార సంస్థాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. కుటుంబ కారణాల వల్ల వ్యాపార సంస్థలు ఒడిదుడుకులకు గురైనప్పుడు, దాని దుష్ప్రుభావం దేశార్థికం పైనే కాదు ప్రజా శ్రేయస్సు పైనా పడుతుంది.
సుస్థిరమైన సంస్థల్ని స్థాపించిన కుటుంబాల వ్యాపారా బాధ్యాతల్ని సమర్ధంగా నిర్వర్తించుకునేలా మలి తరాలను తీర్చిదిద్దకపోవడం వల్ల అనేక సంస్ధలు మూడో తరం వరకు మనలేకపోతున్న దరిమిలా, కొత్త తరాల్లో నేతృత్వ సామర్ధ్యం పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తించి మల్లేశ్వర శాస్త్రి గారు రచించిన ఈ పుస్త్తకం సందర్భోచితం, అత్యంత ప్రాసంగికం.