ప్రతిభకు వైవిధ్యత తోడైతే అది ఎంత నవనవోన్మేషమవుతుందో చూపటానికి ఎమ్వీయల్ ఓ సజీవ ఉదాహరణ. తను ఎన్నుకున్న అధ్యాపక వృత్తికి ఎంతో వన్నె తెచ్చి, విద్యార్థులకొక 'ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్'గా నిలిచినవాడు. కథకుడిగా, నవలాకారుడిగా, వ్యాసకర్తగా, సాహిత్య వ్యాసకర్తగా, సాహిత్య విమర్శకుడిగా, వ్యాఖ్యాతగా, సినిమా పాటల సమీక్షకుడిగా ఇలా కార్తవీర్యార్జునుడే అయ్యాడు.
'యువజ్యోతి'లో యువ మనోవీణను మీటి వారి మనోరాగాలను పలికించినవాడు. ఎంతటి అపరిచితులలోనైనా లేశమాత్రపు ప్రతిభను చూసినా దానికి పట్టం కట్టేవాడు. తన గళం ద్వారా, కలం ద్వారా జగద్విదితం చేసి పరవశించినవాడు. తెలుగు భాష తన సొబగులను, అందచందాలను, స్నిగ్ధతను, సౌకుమార్యాన్ని, ప్రౌఢతను ఆయన పదాలలో, పదబంధాలలో, గళంలో విని మురిసింది. స్నేహానికి ప్రాణమిచ్చే ఎమ్వీయల్ కి ఎంతోమంది 'తీపిగుర్తులు'. వారి మనసుల్లో ఆయన 'చిరంజీవే'.
ప్రతిభకు వైవిధ్యత తోడైతే అది ఎంత నవనవోన్మేషమవుతుందో చూపటానికి ఎమ్వీయల్ ఓ సజీవ ఉదాహరణ. తను ఎన్నుకున్న అధ్యాపక వృత్తికి ఎంతో వన్నె తెచ్చి, విద్యార్థులకొక 'ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్'గా నిలిచినవాడు. కథకుడిగా, నవలాకారుడిగా, వ్యాసకర్తగా, సాహిత్య వ్యాసకర్తగా, సాహిత్య విమర్శకుడిగా, వ్యాఖ్యాతగా, సినిమా పాటల సమీక్షకుడిగా ఇలా కార్తవీర్యార్జునుడే అయ్యాడు. 'యువజ్యోతి'లో యువ మనోవీణను మీటి వారి మనోరాగాలను పలికించినవాడు. ఎంతటి అపరిచితులలోనైనా లేశమాత్రపు ప్రతిభను చూసినా దానికి పట్టం కట్టేవాడు. తన గళం ద్వారా, కలం ద్వారా జగద్విదితం చేసి పరవశించినవాడు. తెలుగు భాష తన సొబగులను, అందచందాలను, స్నిగ్ధతను, సౌకుమార్యాన్ని, ప్రౌఢతను ఆయన పదాలలో, పదబంధాలలో, గళంలో విని మురిసింది. స్నేహానికి ప్రాణమిచ్చే ఎమ్వీయల్ కి ఎంతోమంది 'తీపిగుర్తులు'. వారి మనసుల్లో ఆయన 'చిరంజీవే'.© 2017,www.logili.com All Rights Reserved.