వెన్నెల రాత్రిలో ఆ యువతి చేసిన కవ్వింపు ప్రయత్నం వెనక అసలు రహస్యం, విహారయాత్రలో పసిబిడ్డ ఆకలి తీరిన విధానం, ఉపన్యాసాలకే పరిమితమైన బిడ్డల సంరక్షణా, మధ్యతరగతి మందహాసంలో అనుమాన బీజం, మరణిస్తేనేగాని తెలియని తండ్రి విలువా, పసిబిడ్డలతో పాచిపనులూ, శృంగార భావన కేవలం మానసిక పరిమితికేనని తెలియజెప్పిన అవిద్యావంతురాలూ, జీవిత భాగస్వాములను మార్చే నవనాగరీకం,సిద్ధపడిపోయిన మూడు ప్రాణుల జీవన నేపథ్యం, ఒక యువతితో వాత్సల్య భావన కనిపెట్టిన వృద్ధ జంటా, కేవలం డబ్బే జగత్తుకు మూలం కాదన్న తాత్త్విక సందేశం, మనీషిగా ఎదిగిన ఒక మనిషి జీవనక్రమం, కేవలం ఒకే ఒక్క సంఘటనతో మారిపోయిన నేరస్తుడూ.
ఈ సంపుటిలో ఉన్నవన్నీ సజీవ పాత్రలు. జీవితానుభవాలు. హృద్యమైన కల్పనలు. సహజరీతిలో సాగే సంభాషణలు. సమాజరీతిలో క్రమంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలకు సాహితీ రూపచిత్రణ.
చకచకా సాగిపోయే శైలి. క్లుప్త సంభాషణలు. ఇంకేం? చదవడం మొదలుపెడితే ఆపి ప్రక్కన పెట్టలేని ఆసక్తికర కథనాల సమాహారం ఇది.
- ఎమ్. వి. వి. సత్యనారాయణ