భగవంతుడు ఎవరు? అంటే సమాధానం చెప్పటం తేలిక. ఎవరి నమ్మకాన్ని బట్టి వారు వారి ఇష్టదైవం పేరు చెబుతారు. భగవంతుడు అంటే ఏమిటి? అని అడిగితే చెప్పడం కష్టం. చెప్పాలంటే తత్త్వం తెలియాలి. తత్వానికి సంబంధించిన మరికొన్ని మౌలిక ప్రశ్నలు ఉన్నవి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఏది నిజమైన మతం? ఎవరు సద్గురువు? ఏది నిజమైన సన్యాసం? మొదలైనవి. వీటికి సత్యదర్శనం చేసినవారు, సత్యమే తాము అయినవారు చెప్పినదే సరి అయిన సమాధానం అవుతుంది.
అన్ని రకాల చిలుక పలుకులు కట్టిపెట్టండి. దేన్నైతే మీరు సత్యమని న్యాయమని నమ్ముతారో దాన్ని ఆచరించండి. మీ విశ్వాసాల్ని, నమ్మకాల్ని ప్రదర్శనకు పెట్టవద్దు. మీ మతాన్ని మీరు వదులుకోవలసిన పనిలేదు కాని కేవలం ఆచార వ్యవహారాలూ, కర్మకాండ అనే పై పొట్టును పట్టుకొని వేళ్ళాడటం మానుకోండి. అన్ని మతాలకు అంతస్సూత్రంగా ఉండే ఏకైక సత్యాన్ని గ్రహించటానికి మతాన్ని దాటి వెళ్ళండి.
- మెహెర్ బాబా
భగవంతుడు ఎవరు? అంటే సమాధానం చెప్పటం తేలిక. ఎవరి నమ్మకాన్ని బట్టి వారు వారి ఇష్టదైవం పేరు చెబుతారు. భగవంతుడు అంటే ఏమిటి? అని అడిగితే చెప్పడం కష్టం. చెప్పాలంటే తత్త్వం తెలియాలి. తత్వానికి సంబంధించిన మరికొన్ని మౌలిక ప్రశ్నలు ఉన్నవి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఏది నిజమైన మతం? ఎవరు సద్గురువు? ఏది నిజమైన సన్యాసం? మొదలైనవి. వీటికి సత్యదర్శనం చేసినవారు, సత్యమే తాము అయినవారు చెప్పినదే సరి అయిన సమాధానం అవుతుంది. అన్ని రకాల చిలుక పలుకులు కట్టిపెట్టండి. దేన్నైతే మీరు సత్యమని న్యాయమని నమ్ముతారో దాన్ని ఆచరించండి. మీ విశ్వాసాల్ని, నమ్మకాల్ని ప్రదర్శనకు పెట్టవద్దు. మీ మతాన్ని మీరు వదులుకోవలసిన పనిలేదు కాని కేవలం ఆచార వ్యవహారాలూ, కర్మకాండ అనే పై పొట్టును పట్టుకొని వేళ్ళాడటం మానుకోండి. అన్ని మతాలకు అంతస్సూత్రంగా ఉండే ఏకైక సత్యాన్ని గ్రహించటానికి మతాన్ని దాటి వెళ్ళండి. - మెహెర్ బాబా© 2017,www.logili.com All Rights Reserved.