ఎవరినైనా తల్చుకున్నపుడు ముఖ్యంగా గుర్తొచ్చే అంశాలు, వాళ్ళకి మనకి ఉన్న అనుబంధం , సంబంధిత స్మృతులే!
ఒక లాయర్ గా, ఆడిటర్ గ ఉంటూ అరడజను మంది బిడ్డల తండ్రిగా సమాజంలో పలు బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మా నాన్నగారు శ్రీ కోటంరాజు సత్యనారాయణ శర్మ గారు సాహిత్యాభిమానాన్ని ఎన్ని విధాలా ప్రకటించారో వారితో పరిచయం ఉన్న అందరికి అనుభవైకవేద్యమే!
నాన్నగారు స్వయంగా ఎన్నో రచనలు చేసి ప్రచురించుకోవటంలో ఆసక్తి చూపలేదన్నది ఎప్పుడూ నన్ను బాధించే అంశం. వారు రాసిన "కృష్ణా కల్పద్రుమా" పద్యాలను లోగడ ప్రచురించిన నాన్నగారి వ్యాసాలతో సాహిత్యాభిమానుల కోసం "నాన్నగారి రచనలుగా " అందించటం కూతురిగా నాకెంతో అభిమానపాత్రమైన విషయం. రెండేళ్ళక్రితం తన కలం సంపదను వదిలేసి పైలోకాలకు వెళ్ళిపోయినా నాన్నగారికి 88 వ జయంతి సందర్భంగా నివాళిగా ఈ చిన్న అక్షరమాలిక .