బాల్యం ఎవరికయినా ఆనందాన్ని కలిగించేదే! కాని నా స్మృతులు నన్ను నిరంతరం వెంటాడి వాటికో అక్షరారూపాన్ని కల్పించేవరకు ఊరుకోలేదు. ఒకసారి నేను చిన్నతనంలో గడిపిన ఊరికి వెళ్లి వచ్చి మాటల సందర్భంలో శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ గారితో చెప్పాను. ఆ జ్ఞాపకాలతో నేను వ్రాసిన కవిత నొకదానిని వినిపించాను. ఆ స్మృతులను కవితలుగా కాక వచనంలో వ్రాస్తే ప్రతి సంఘటన, ప్రతి అనుభూతి జారిపోకుండా పదిలంగా ఉంటుందని సూచించారు. నిజమేననిపించింది. ఆ ఆలోచనే ఈ పుస్తకంగా అవతరించింది. నా ఈ చిట్టి పాపకి పేరు పెట్టిన మేనమామ కూడా ఆయనే! ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.
బాల్యంలో వేసిన అడుగులన్నిటికీ చేయూతనిచ్చి నన్నింతదాన్ని చేసిన అమ్మమ్మకు, నానమ్మకు పుస్తకాన్ని అన్కితమివ్వటం నా కనీస ధర్మమని భావిస్తున్నాను. అడగగానే ఎన్నో పనులమధ్య తీరిక చేసుకొని 'స్మృతిరేఖల్లో చిద్విలాసాన్ని' అందించిన గురుతుల్యులు, మాన్యులు శ్రీ కసిరెడ్డిగారికి ధన్యవాదాలు. ఇంకేముంది చెప్పటానికి పుస్తకం మీ ముందుంది. ప్రోత్సాహించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ...
బాల్యం ఎవరికయినా ఆనందాన్ని కలిగించేదే! కాని నా స్మృతులు నన్ను నిరంతరం వెంటాడి వాటికో అక్షరారూపాన్ని కల్పించేవరకు ఊరుకోలేదు. ఒకసారి నేను చిన్నతనంలో గడిపిన ఊరికి వెళ్లి వచ్చి మాటల సందర్భంలో శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ గారితో చెప్పాను. ఆ జ్ఞాపకాలతో నేను వ్రాసిన కవిత నొకదానిని వినిపించాను. ఆ స్మృతులను కవితలుగా కాక వచనంలో వ్రాస్తే ప్రతి సంఘటన, ప్రతి అనుభూతి జారిపోకుండా పదిలంగా ఉంటుందని సూచించారు. నిజమేననిపించింది. ఆ ఆలోచనే ఈ పుస్తకంగా అవతరించింది. నా ఈ చిట్టి పాపకి పేరు పెట్టిన మేనమామ కూడా ఆయనే! ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాల్యంలో వేసిన అడుగులన్నిటికీ చేయూతనిచ్చి నన్నింతదాన్ని చేసిన అమ్మమ్మకు, నానమ్మకు పుస్తకాన్ని అన్కితమివ్వటం నా కనీస ధర్మమని భావిస్తున్నాను. అడగగానే ఎన్నో పనులమధ్య తీరిక చేసుకొని 'స్మృతిరేఖల్లో చిద్విలాసాన్ని' అందించిన గురుతుల్యులు, మాన్యులు శ్రీ కసిరెడ్డిగారికి ధన్యవాదాలు. ఇంకేముంది చెప్పటానికి పుస్తకం మీ ముందుంది. ప్రోత్సాహించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ...© 2017,www.logili.com All Rights Reserved.