ఒకనాడు రైతు రాజుగా వెలిగాడు. నేడు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. విత్తనాల కోసం, ఎరువుల కోసం రోడ్దేక్కుతున్నాడు. రసాయన ఎరువులు వేసి పొందే దిగుబడులు నిజమైనవి కావు. పైగా ఈ రసాయన ఎరువుల వాడకంతో భూమి అంతకంతకూ సారాన్ని కోల్పోతోంది. పురుగుమందుల పిచికారీతో పండే పంటలు విషతుల్యమవుతున్నాయి. ఇది పర్యావరణం మీద కూడా దుష్ప్రభావం చూపిస్తోంది. పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వెయ్యడం కోసం బంగారం, పొలం ఇలా ఏదిబడితే అది తాకట్టుపెట్టి రైతులు అప్పులు చేస్తున్నారు.
ఇలా పెట్టుబడులు విపరీతంగా పెట్టడం, ఆ వచ్చిన దిగుబడితో పెట్టుబడి కూడా దక్కకపోవడంతో రైతు ఏయేటికాయేడు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. ఈ దుస్థితి పోయి భారతదేశ వ్యవసాయరంగం తిరిగి పటిష్టంగా నిలవాలన్నా, రైతు ఆర్థికంగా బలవంతుడవ్వాలన్నా మనకు సుభాష్ పాలేకర్ గారి విధానమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఈ విధానంలో పెట్టుబడి నామమాత్రం కాబట్టి రైతు ఆర్థికంగా బలంగా ఉంటాడు. సమాజంలో రైతుదే పైచేయి అవుతుంది.
ఒకనాడు రైతు రాజుగా వెలిగాడు. నేడు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. విత్తనాల కోసం, ఎరువుల కోసం రోడ్దేక్కుతున్నాడు. రసాయన ఎరువులు వేసి పొందే దిగుబడులు నిజమైనవి కావు. పైగా ఈ రసాయన ఎరువుల వాడకంతో భూమి అంతకంతకూ సారాన్ని కోల్పోతోంది. పురుగుమందుల పిచికారీతో పండే పంటలు విషతుల్యమవుతున్నాయి. ఇది పర్యావరణం మీద కూడా దుష్ప్రభావం చూపిస్తోంది. పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వెయ్యడం కోసం బంగారం, పొలం ఇలా ఏదిబడితే అది తాకట్టుపెట్టి రైతులు అప్పులు చేస్తున్నారు. ఇలా పెట్టుబడులు విపరీతంగా పెట్టడం, ఆ వచ్చిన దిగుబడితో పెట్టుబడి కూడా దక్కకపోవడంతో రైతు ఏయేటికాయేడు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. ఈ దుస్థితి పోయి భారతదేశ వ్యవసాయరంగం తిరిగి పటిష్టంగా నిలవాలన్నా, రైతు ఆర్థికంగా బలవంతుడవ్వాలన్నా మనకు సుభాష్ పాలేకర్ గారి విధానమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఈ విధానంలో పెట్టుబడి నామమాత్రం కాబట్టి రైతు ఆర్థికంగా బలంగా ఉంటాడు. సమాజంలో రైతుదే పైచేయి అవుతుంది.23
© 2017,www.logili.com All Rights Reserved.