ఆర్।ఎస్। సుదర్శనం గారిని నేను మొట్టమొదటిసారి 1970 లో హైదరాబాద్ లో కలుసుకున్నాను। అప్పటికే అయన విమర్శకుడిగా ప్రఖ్యాతుడు। అంతకు ముందే "భారతి " పత్రికలో సీరియల్ గా వస్తున్న అయన "సాహిత్యంలో దృక్పథలు" వ్యాసాల్ని క్రమం తప్పకుండ చదువుతూండేవాడిని। నాకు బాగా తెలిసిన చలం, విశ్వనాధ ఉన్నవ, గోపీచంద్, బుచ్చిబాబు లాంటి రచయితల్ని లోతుగా అర్ధం చేసుకోవటానికి ఈ వ్యాసాలు నాకెంతో తోడ్పడ్డాయి । నవలారచయితల మీద ఇంత లోతైన విశ్లేషణాల్ని నేను అంతకుముందెప్పుడు చదవలేదు। తెలుగు సాహితి విమర్శంత కావిత్వానికే పరిమితమై ఉన్న ఆనాటి పరిస్థితిలో వచన రచనల మీదా ఇంత లోతైన విమర్శ వెలువడటం నన్ను ముగ్ధుణ్ణి చేసింది। ఆనాటి నుండి నేను సుదర్శనం గారి అభిమానినైపోయాను । 1970 లో హైద్రాబాద్ లో జరుగుతున్న ఒక సాహితి సమావేశంలో ఆయనను కలుసుకోగల్గినందుకు నేనెంత సంతోషించానో చెప్పలేను।