ఒకప్పుడు దేశీయ వ్యవసాయ విధానంతో బీడు భూముల్లో సైతం ధాన్యపు రాశులు పండించిన రైతు, విషతుల్యమైన రసాయన ఎరువుల మాయలో పడి మాగాణి పంటభూములని సైతం బీడు భూములుగా మార్చుకుని దిక్కుతోచని స్థితిలో దిగాలు పడి చూస్తున్న తరుణంలో, మళ్ళీ దేశీయ సాగు విధానం తెరపైకి రావడం శుభసూచకం. పర్యావరణ పరిరక్షణ, రైతుసంక్షేమం లక్ష్యంగా, చంద్రునికో నూలుపోగులా ఈ పుస్తకం తీసుకొస్తున్నాము. దేశీయ సాగుపధ్ధతి, జాతీయ ఎరువుల వాడకంతోపాటు, అవసరాన్ని బట్టి పర్యావరణానికి ఎలాంటి హానీ చెయ్యని జీవరసాయన ఎరువుల వాడకాన్ని ఈ పుస్తకంలో సూచించాము. సమగ్ర సేంద్రియ వ్యవసాయ విధానంలో రైతులు తిరిగి అభివృద్ధి పథంలోకి అడుగువెయ్యడానికి ఈ పుస్తకం చిరుదివ్వె కావాలని ఆశిస్తున్నాము. ఇందులోనే పద్మశ్రీ పాలేకర్ గారి 'పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానం' అనుబంధంగా ఇస్తున్నాము.
ఒకప్పుడు దేశీయ వ్యవసాయ విధానంతో బీడు భూముల్లో సైతం ధాన్యపు రాశులు పండించిన రైతు, విషతుల్యమైన రసాయన ఎరువుల మాయలో పడి మాగాణి పంటభూములని సైతం బీడు భూములుగా మార్చుకుని దిక్కుతోచని స్థితిలో దిగాలు పడి చూస్తున్న తరుణంలో, మళ్ళీ దేశీయ సాగు విధానం తెరపైకి రావడం శుభసూచకం. పర్యావరణ పరిరక్షణ, రైతుసంక్షేమం లక్ష్యంగా, చంద్రునికో నూలుపోగులా ఈ పుస్తకం తీసుకొస్తున్నాము. దేశీయ సాగుపధ్ధతి, జాతీయ ఎరువుల వాడకంతోపాటు, అవసరాన్ని బట్టి పర్యావరణానికి ఎలాంటి హానీ చెయ్యని జీవరసాయన ఎరువుల వాడకాన్ని ఈ పుస్తకంలో సూచించాము. సమగ్ర సేంద్రియ వ్యవసాయ విధానంలో రైతులు తిరిగి అభివృద్ధి పథంలోకి అడుగువెయ్యడానికి ఈ పుస్తకం చిరుదివ్వె కావాలని ఆశిస్తున్నాము. ఇందులోనే పద్మశ్రీ పాలేకర్ గారి 'పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానం' అనుబంధంగా ఇస్తున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.