తెలుగువారి ఆదికవి నన్నయభట్టారకుని ఆదరించి, ఆంద్రమహాభారత అవతరణకు ప్రోత్సాహమిచ్చి, ఆ ఇతిహాసాన్ని కృతి పొందిన వేంగీ చాళుక్య వంశపు రాజు రాజరాజనరేంద్రుడు. ఆంద్రదేశచరిత్రలో వేంగీ చాళుక్యవంశానిది ప్రత్యెక స్థానం. ఆంద్రభాషాచరిత్రలో నన్నయతోపాటు రాజరాజుది పూజనీయ స్థానం. 'నిత్యసత్యవచను'డైన నన్నయ చెప్పిన ప్రకారం రాజరాజు సుందరరూపుడు. మహాపరాక్రమశాలి, విద్వాంసుడు, పరమభక్తుడు, వ్యసనములులేనివాడు, విద్యా గోష్ఠులలో నాయకమణియై అలరారినవాడు.
రాజరాజ నరేంద్రుడు, నన్నయ, ఆంద్ర మహాభారత విశేషాలు, నాటి రాజకీయ పరిస్థితులు, భాషాస్థితి, సమాజం - వీటన్నిటి సంగతుల సమాహారంగా రాజమహేంద్రవరములోని ఆంద్రదేశీయేతిహాస పరిశోధకమండలివారు భావరాజు వెంకటకృష్ణారావు సంపాదకత్వంతో శ్రీ రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచికను 1922 లో ప్రచురించారు. చరిత్ర ప్రధానవిషయంగా తెలుగులో ప్రచురించిన ప్రత్యేక సంచికలలో ఇది మొదటిది.
తెలుగువారి ఆదికవి నన్నయభట్టారకుని ఆదరించి, ఆంద్రమహాభారత అవతరణకు ప్రోత్సాహమిచ్చి, ఆ ఇతిహాసాన్ని కృతి పొందిన వేంగీ చాళుక్య వంశపు రాజు రాజరాజనరేంద్రుడు. ఆంద్రదేశచరిత్రలో వేంగీ చాళుక్యవంశానిది ప్రత్యెక స్థానం. ఆంద్రభాషాచరిత్రలో నన్నయతోపాటు రాజరాజుది పూజనీయ స్థానం. 'నిత్యసత్యవచను'డైన నన్నయ చెప్పిన ప్రకారం రాజరాజు సుందరరూపుడు. మహాపరాక్రమశాలి, విద్వాంసుడు, పరమభక్తుడు, వ్యసనములులేనివాడు, విద్యా గోష్ఠులలో నాయకమణియై అలరారినవాడు. రాజరాజ నరేంద్రుడు, నన్నయ, ఆంద్ర మహాభారత విశేషాలు, నాటి రాజకీయ పరిస్థితులు, భాషాస్థితి, సమాజం - వీటన్నిటి సంగతుల సమాహారంగా రాజమహేంద్రవరములోని ఆంద్రదేశీయేతిహాస పరిశోధకమండలివారు భావరాజు వెంకటకృష్ణారావు సంపాదకత్వంతో శ్రీ రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచికను 1922 లో ప్రచురించారు. చరిత్ర ప్రధానవిషయంగా తెలుగులో ప్రచురించిన ప్రత్యేక సంచికలలో ఇది మొదటిది.© 2017,www.logili.com All Rights Reserved.