ఈ వ్యాసాలు ఫాసిజం ఎలా పని చేస్తున్నదో వివరించడానికే పరిమితం కావు. అది ఎందుకు ఆలా పని చేస్తున్నదో విశ్లేషిస్తాయి . మూడు వేల ఏళ్ల కిందట కుల వ్యవస్థ దగ్గరి నుంచి సామ్రాజ్యవాదంగా మారిన ప్రపంచ పెట్టుబడిదారీ విధానం దాకా వివి చూపు ప్రసరిస్తుంది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే వచ్చినా, దాన్ని ఓడించేందుకు సాంఘిక , సాంస్కృతిక, భావజాల రంగాల్లో పోరాడాలనే అవగాహనను అందిస్తాయి. దానికి ఆర్ధిక రాజకీయ పోరాటాల దిక్సుచి తప్పనిసరి అని వివి అంటారు. ముప్పై ఏళ్ల కింద మతానికి, వర్గానికి ఉన్న సంబంధం దగ్గర మొదలైన ఆయన విశ్లేషణ ఇవాళ భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ఆర్ధిక విధానాల నీడన బూర్జవా నియంతృత్వంగా మారిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, బ్రాహ్మణీయ హిందుత్వకు ఉన్న సంబంధం దాకా విస్తరించింది.