పాలకుల రాజ్యహింస కారణంగా మనిషి లోపల బయట జరిగే విధ్వంసం నుంచి నేలతల్లి బిడ్డలను కాపాడుకోవటానికి కాలంతో నడిచిన రచయిత అల్లం రాజయ్య . కల్లోల దశాబ్దాల్లో నిర్మాణ మౌతున్న ప్రజల పోరాట చరిత్రని రాజయ్య సాహిత్యం నమోదు చేసింది. భూ నిర్వాసితత్వాన్ని ప్రశించి తిరగబడ్డ "సృష్టికర్తలు" అతని సాహిత్యంలోని పాత్రలు. కొనసాగుతున్న ప్రజాయుద్ధానికి సాంస్కృతిక ప్రతిఫలానాలే రాజయ్య సృజనాత్మక రచనలు.
వరవరరావు రాజయ్యలు కల్లోల నక్సల్బరీ దశాబ్దాల జైత్రయాత్రకు ప్రత్యేక్ష సాక్షులు . రాజయ్య రచనల నేపథ్యంలో ని సాంస్కృతిక రాజకీయ చరిత్రని అనితర సాధ్యంగా విశ్లేషించారు వరవరరావు. రాజయ్య సాహిత్యానికి వరవరరావు ముందుమాటలు ఒక సూక్ష్మదర్శిని , ఒక దూరదర్శిని.
వరవరరావు రాజయ్యలు ఇద్దరూ విరాసం సభ్యులు . రాజయ్య సృజనాత్మక సాహిత్యం పై వరవరరావు గతితార్కిక విశ్లేషణ ఈ జైత్రయాత్ర...