వ్యాసుడు కేవలం ఒక మహర్షి ఒక గురువు, ఒక గ్రంథకర్త మాత్రమే కాదు. ఆయన శ్రీమహావిష్ణువు అవతారాలలో ఒక అవతారం. ఇది భాగవతోత్తములంతా నిస్సంకోచంగా అంగీకరించిన విషయం. కాని, ఆధునిక 'జిజ్ఞాసువు' లకు ఈ వాదనలు సంతృప్తి కలిగిస్తాయా?... అందుకే ఈ 'వేదవ్యాసుడు' రచన. భారతీయ వాజ్మయంలో 'పంచవేదం' గా చెప్పబడే మహాభారతాన్ని - ఆ గాథ జరగటానికి చాలా సంవత్సరాలు ముందుగానే దర్శించి, రచించిన వారు 'వేదవ్యాసులు'. భారతం కచ్చితంగా ఇలాగే జరుగుతుంది - అని దర్శించి, అందులో తన పాత్ర కూడా వస్తుందని గ్రహించి, జరగబోయే దాన్ని యథాతథంగా భవిష్యత్తరాలకు అందించటం సర్వశక్తిమంతుడైన భగవంతుడికి కాక వేరొకరికి సాధ్యమా? ఈ వాస్తవాన్ని సోదాహరనంగా నిర్ధారించి, అక్షరబద్ధం చేయటమే ఈ అనువాద రచన 'వేదవ్యాసుడు' లక్ష్యం.
- గోపిక ప్రసాద్
వ్యాసుడు కేవలం ఒక మహర్షి ఒక గురువు, ఒక గ్రంథకర్త మాత్రమే కాదు. ఆయన శ్రీమహావిష్ణువు అవతారాలలో ఒక అవతారం. ఇది భాగవతోత్తములంతా నిస్సంకోచంగా అంగీకరించిన విషయం. కాని, ఆధునిక 'జిజ్ఞాసువు' లకు ఈ వాదనలు సంతృప్తి కలిగిస్తాయా?... అందుకే ఈ 'వేదవ్యాసుడు' రచన. భారతీయ వాజ్మయంలో 'పంచవేదం' గా చెప్పబడే మహాభారతాన్ని - ఆ గాథ జరగటానికి చాలా సంవత్సరాలు ముందుగానే దర్శించి, రచించిన వారు 'వేదవ్యాసులు'. భారతం కచ్చితంగా ఇలాగే జరుగుతుంది - అని దర్శించి, అందులో తన పాత్ర కూడా వస్తుందని గ్రహించి, జరగబోయే దాన్ని యథాతథంగా భవిష్యత్తరాలకు అందించటం సర్వశక్తిమంతుడైన భగవంతుడికి కాక వేరొకరికి సాధ్యమా? ఈ వాస్తవాన్ని సోదాహరనంగా నిర్ధారించి, అక్షరబద్ధం చేయటమే ఈ అనువాద రచన 'వేదవ్యాసుడు' లక్ష్యం. - గోపిక ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.