ఈ ప్రపంచంలో ఎంతోమంది పుడుతున్నారు, గిడుతున్నారు. కానీ వారిలో ఏ కొద్దిమందో చరిత్రపుటల్లో మహనీయులుగా నిలుస్తున్నారు. ఒక మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, చాణక్యుడు, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్... ఇలా ఒకరేమిటి? ఎందరో... ఎందరెందరో! సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారం భగవద్గీత అయితే, ఎందరో మహనీయుల జీవితాల్లోంచి ఉద్భవించిన అనుభవ పాఠాల సారమే ఈ 'ఆణిముత్యాలు'.
భవిష్యత్తు అంధకారంలో ఉన్నప్పుడు ఒక వెలుగురేఖ కోసం వెతుకుతాం. దుఃఖసాగరంలో మునిగి ఉన్నప్పుడు ఒడ్డుకు చేర్చగల ఒక అమృతహస్తం కోసం ఎదురుచూస్తాం. సరిగ్గా అలాంటి సమయాల్లోనే ఈ ఆణిముత్యాలు అవసరమవుతాయి. ఇందులో... నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు, రకరకాల సందేహాలకు, భయాందోళనలకు చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఎవరైతే జీవితమనే సాగరాన్ని దాటాలనుకుంటారో, అటువంటివారు ఆణిముత్యాలు అనే నావనెక్కి సుఖంగా, సులువుగా అవతలి ఒడ్డుకు చేరుకోవచ్చు. వీటిని చదివిన ప్రతిసారీ కొత్త అర్థాలు పుట్టుకొస్తుంటాయి. అనేకమైన లౌకిక, అలౌకిక ఆనందాలు, ప్రయోజనాలు కలుగుతాయి.
"విద్య వల్ల ఎదగాలి వినయంతో మెలగాలి"
ఈ ప్రపంచంలో ఎంతోమంది పుడుతున్నారు, గిడుతున్నారు. కానీ వారిలో ఏ కొద్దిమందో చరిత్రపుటల్లో మహనీయులుగా నిలుస్తున్నారు. ఒక మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, చాణక్యుడు, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్... ఇలా ఒకరేమిటి? ఎందరో... ఎందరెందరో! సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారం భగవద్గీత అయితే, ఎందరో మహనీయుల జీవితాల్లోంచి ఉద్భవించిన అనుభవ పాఠాల సారమే ఈ 'ఆణిముత్యాలు'. భవిష్యత్తు అంధకారంలో ఉన్నప్పుడు ఒక వెలుగురేఖ కోసం వెతుకుతాం. దుఃఖసాగరంలో మునిగి ఉన్నప్పుడు ఒడ్డుకు చేర్చగల ఒక అమృతహస్తం కోసం ఎదురుచూస్తాం. సరిగ్గా అలాంటి సమయాల్లోనే ఈ ఆణిముత్యాలు అవసరమవుతాయి. ఇందులో... నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు, రకరకాల సందేహాలకు, భయాందోళనలకు చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఎవరైతే జీవితమనే సాగరాన్ని దాటాలనుకుంటారో, అటువంటివారు ఆణిముత్యాలు అనే నావనెక్కి సుఖంగా, సులువుగా అవతలి ఒడ్డుకు చేరుకోవచ్చు. వీటిని చదివిన ప్రతిసారీ కొత్త అర్థాలు పుట్టుకొస్తుంటాయి. అనేకమైన లౌకిక, అలౌకిక ఆనందాలు, ప్రయోజనాలు కలుగుతాయి. "విద్య వల్ల ఎదగాలి వినయంతో మెలగాలి"© 2017,www.logili.com All Rights Reserved.