అమూర్త భావాలకు అక్షర రూపాన్నివ్వగలిగే ప్రతిభ శ్రీనివాసరావు సొంతం. వచ్చిన క్షణాలు, వెళుతున్న క్షణాల చలనాన్ని క్షుణ్ణంగా గమనిస్తాడు. కాలానికి పరిమలాలద్దె పుష్పించే క్షణాల్ని అక్షరీకరించగలడు. అక్షరాలని లాలిస్తాడు, పాలిస్తాడు. అక్షరాల అక్షౌహిణులతో కవాతు చేయిస్తాడు. అవ్యక్త స్థబ్ద స్థితిని కవిత్వీకరించడం అంత సులభం కాదు, శ్రీనివాసరావు సాధించిన ఆ ప్రయత్న రహిత ప్రయత్నం ఫలితమే మార్మికత ధ్వనించే ఈ వాస్తవికత. కవులు తాత్వికులు కారు. సాధారణంగా కవిత్వం సౌందర్యప్రధానం. కానీ తాత్విక స్పర్శ ఉన్న కవిత్వం సత్యానికి సన్నిహితంగా ఉంటుంది. శ్రీనివాసరావు కవితాత్వికుడు. ఇతడొక జీవనచైతన్య రహస్యం తెలిసిన కవి! జైలులాంటి ప్రపంచంలో ఈ కవి ఒక జెన్ రుషి!
అమూర్త భావాలకు అక్షర రూపాన్నివ్వగలిగే ప్రతిభ శ్రీనివాసరావు సొంతం. వచ్చిన క్షణాలు, వెళుతున్న క్షణాల చలనాన్ని క్షుణ్ణంగా గమనిస్తాడు. కాలానికి పరిమలాలద్దె పుష్పించే క్షణాల్ని అక్షరీకరించగలడు. అక్షరాలని లాలిస్తాడు, పాలిస్తాడు. అక్షరాల అక్షౌహిణులతో కవాతు చేయిస్తాడు. అవ్యక్త స్థబ్ద స్థితిని కవిత్వీకరించడం అంత సులభం కాదు, శ్రీనివాసరావు సాధించిన ఆ ప్రయత్న రహిత ప్రయత్నం ఫలితమే మార్మికత ధ్వనించే ఈ వాస్తవికత. కవులు తాత్వికులు కారు. సాధారణంగా కవిత్వం సౌందర్యప్రధానం. కానీ తాత్విక స్పర్శ ఉన్న కవిత్వం సత్యానికి సన్నిహితంగా ఉంటుంది. శ్రీనివాసరావు కవితాత్వికుడు. ఇతడొక జీవనచైతన్య రహస్యం తెలిసిన కవి! జైలులాంటి ప్రపంచంలో ఈ కవి ఒక జెన్ రుషి!© 2017,www.logili.com All Rights Reserved.