కెనడా దేశస్తుడైన డా॥ ఫంగ్ కిడ్ని వైద్య నిపుణులు. ఒబేసిటీ, డయాబెటిస్, ఫాస్టింగ్లపై ఆయన రాసిన పుస్తకాల ద్వారా సాంప్రదాయ వైద్యంపై
గొప్ప తిరుగుబాటు చేశారు. జర్మనీకి చెందిన హెన్రిచ్ వార్నర్ (1888-1970) ఒక భౌతిక శాస్త్రవేత. ఆయన కణాలు శక్తిని ఎలా తయారు చేసుకుంటున్నాయన్న అంశంపై విస్తృత అధ్యయనం చేశాడు. జీవశాస్త్రానికి భౌతిక, రసాయన శాస్త్రాలను జోడించాడు. సాధారణ కణాలకు, కాన్సరు కణాలకు జీవక్రియలలో గల తేడాలను గుర్తించాడు.. జీవశాస్త్ర పరిణామ వాద కోణం నుండి ఈ సమస్యను పరిశోధించారు.
అపుడు కాన్నరు మెట్లు మెట్లుగా ఎదగడం లేదని, పెరుగుదల, చొరబాటు, వ్యాప్తి వంటివి దశలవారీగా జరగడం లేదని అర్థమైంది. శరీరంలో కాన్సరు కొంతకాలం పాటు పెరిగాక మాత్రమే వ్యాప్తి చెందగలదన్న భావన తప్పు అని తేలింది. ఆరంభం నుండే వ్యాప్తి కూడా కాన్సరు లక్షణంగా గుర్తించారు.
దశలవారీగా పెరుగుదల వుండి వుంటే కాన్సరుకు చికిత్స సులువయి ఉండేది. కాన్సరు వచ్చిన భాగాన్ని సర్జరీ చేసి తొలగిస్తే అది అక్కడికి నిలిచి ఉండాలి. కానీ కాన్సరు వచ్చినట్లు గుర్తించేనాటికే ఆ కణాలు ఇతర శరీర భాగాల్లోకి చేరుతున్నట్లు బయటపడింది.
మమ్మోగ్రఫి పరీక్ష చేసే 10 మందిలో ఒకరికి మాత్రమే కాన్సరు పాజిటివ్ అన్న ఫలితం వస్తుంది. అలా పాజిటివ్ గా తేలిన వాళ్ళలో నూటికి 5 మందికే కాన్సరు వుంది. 95 మందిలో అవసరం లేకున్నా ఆ పరీక్షకు కొనసాగింపుగా మళ్ళీ బయాప్సీ పరీక్షలు, గడ్డల సర్జరీ, కొందరికి కీమోథెరపీలు కూడా చేస్తున్నారు. ఎక్కువ మందిలో రొమ్మును మొత్తంగా తొలగించడం (Mastectomy), రేడియేషన్ ఇస్తున్నారు. అమెరికాలో తీసిన లెక్కలలో పాజిటివ్ ఫలితం వచ్చిన వాటిలో 30 నుండి 50 శాతం తప్పు రిపోర్టులని తేలింది. దీనితో పాటు మమ్మోగ్రఫీ అయ్యాక పెరిగే మానసిక, శారీరక వ్యధలవల్ల జీవితపు నాణ్యత తగ్గిపోతుంది.
35 శాతం కాన్సర్లు పోషకాహారంతో ముడిపడి ఉంటాయి. కాన్సరుకు పొగాకు తర్వాత రెండో కారణం ఆహార లభ్యతే. అదనపు బరువు కాన్సరును తెచ్చిపెట్టే అంశం అని చెప్పుకున్నాం. అనేక రకాల కాన్సర్లు తగ్గుముఖంలో ఉన్నప్పటికీ, ఊబకాయ సంబంధ కాన్సర్లు సోకడం పెరుగుతోంది. అందువల్ల వాటి నివారణ కోసం ఆహారపరమైన వ్యూహాలు రూపొందించుకోవలసిందేనంటాడు జాసన్ఫంగ్.
కాన్సరు రాకుండా అద్భుతాలు సృష్టించగల ఆహారాలేమీ లేవు. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇన్సులిన్ అధికం కావడం వల్ల వస్తున్న ఊబకాయం, మధుమేహం-2లను నివారించగల వ్యూహమే కాన్సరుకూ పనికి వస్తుంది.
కెనడా దేశస్తుడైన డా॥ ఫంగ్ కిడ్ని వైద్య నిపుణులు. ఒబేసిటీ, డయాబెటిస్, ఫాస్టింగ్లపై ఆయన రాసిన పుస్తకాల ద్వారా సాంప్రదాయ వైద్యంపై గొప్ప తిరుగుబాటు చేశారు. జర్మనీకి చెందిన హెన్రిచ్ వార్నర్ (1888-1970) ఒక భౌతిక శాస్త్రవేత. ఆయన కణాలు శక్తిని ఎలా తయారు చేసుకుంటున్నాయన్న అంశంపై విస్తృత అధ్యయనం చేశాడు. జీవశాస్త్రానికి భౌతిక, రసాయన శాస్త్రాలను జోడించాడు. సాధారణ కణాలకు, కాన్సరు కణాలకు జీవక్రియలలో గల తేడాలను గుర్తించాడు.. జీవశాస్త్ర పరిణామ వాద కోణం నుండి ఈ సమస్యను పరిశోధించారు. అపుడు కాన్నరు మెట్లు మెట్లుగా ఎదగడం లేదని, పెరుగుదల, చొరబాటు, వ్యాప్తి వంటివి దశలవారీగా జరగడం లేదని అర్థమైంది. శరీరంలో కాన్సరు కొంతకాలం పాటు పెరిగాక మాత్రమే వ్యాప్తి చెందగలదన్న భావన తప్పు అని తేలింది. ఆరంభం నుండే వ్యాప్తి కూడా కాన్సరు లక్షణంగా గుర్తించారు. దశలవారీగా పెరుగుదల వుండి వుంటే కాన్సరుకు చికిత్స సులువయి ఉండేది. కాన్సరు వచ్చిన భాగాన్ని సర్జరీ చేసి తొలగిస్తే అది అక్కడికి నిలిచి ఉండాలి. కానీ కాన్సరు వచ్చినట్లు గుర్తించేనాటికే ఆ కణాలు ఇతర శరీర భాగాల్లోకి చేరుతున్నట్లు బయటపడింది. మమ్మోగ్రఫి పరీక్ష చేసే 10 మందిలో ఒకరికి మాత్రమే కాన్సరు పాజిటివ్ అన్న ఫలితం వస్తుంది. అలా పాజిటివ్ గా తేలిన వాళ్ళలో నూటికి 5 మందికే కాన్సరు వుంది. 95 మందిలో అవసరం లేకున్నా ఆ పరీక్షకు కొనసాగింపుగా మళ్ళీ బయాప్సీ పరీక్షలు, గడ్డల సర్జరీ, కొందరికి కీమోథెరపీలు కూడా చేస్తున్నారు. ఎక్కువ మందిలో రొమ్మును మొత్తంగా తొలగించడం (Mastectomy), రేడియేషన్ ఇస్తున్నారు. అమెరికాలో తీసిన లెక్కలలో పాజిటివ్ ఫలితం వచ్చిన వాటిలో 30 నుండి 50 శాతం తప్పు రిపోర్టులని తేలింది. దీనితో పాటు మమ్మోగ్రఫీ అయ్యాక పెరిగే మానసిక, శారీరక వ్యధలవల్ల జీవితపు నాణ్యత తగ్గిపోతుంది. 35 శాతం కాన్సర్లు పోషకాహారంతో ముడిపడి ఉంటాయి. కాన్సరుకు పొగాకు తర్వాత రెండో కారణం ఆహార లభ్యతే. అదనపు బరువు కాన్సరును తెచ్చిపెట్టే అంశం అని చెప్పుకున్నాం. అనేక రకాల కాన్సర్లు తగ్గుముఖంలో ఉన్నప్పటికీ, ఊబకాయ సంబంధ కాన్సర్లు సోకడం పెరుగుతోంది. అందువల్ల వాటి నివారణ కోసం ఆహారపరమైన వ్యూహాలు రూపొందించుకోవలసిందేనంటాడు జాసన్ఫంగ్. కాన్సరు రాకుండా అద్భుతాలు సృష్టించగల ఆహారాలేమీ లేవు. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇన్సులిన్ అధికం కావడం వల్ల వస్తున్న ఊబకాయం, మధుమేహం-2లను నివారించగల వ్యూహమే కాన్సరుకూ పనికి వస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.