సాహితీరంగంలో కృషిచేస్తున్న కొందరు వర్తమాన కవుల వ్యక్తిత్వాలను రాధేయ ఎంతో చిత్తశుద్ధితో తమ 'అవగాహన' అన్న గ్రంథంలో చిత్రీకరించారు. ఇందులో ప్రతిభామూర్తులైన సాహితీవేత్తలను గురించిన వ్యాసాలున్నాయి. వారి కవితా సంపుటాల నుంచి విస్తృతంగా ఉదాహరణలను ఇవ్వటం కూడా జరిగింది. దీంతో పాఠకుడికి ఆ కవిని గూర్చిన పూర్తి అవగాహన ఏర్పడిందని చెప్పవచ్చు. ఎంతో ఓపికతో విషయసేకరణ చేసి వ్యాస పరంపరను పూలబాణాలుగా సంధించిన డా రాధేయకు నా అభినందనలు.
- డా అమ్మంగి వేణుగోపాల్
కవిగా, కవిత్వ పాఠకునిగా, కవిత్వ విమర్శకునిగా రాధేయ రాటుదేలినవారు. ఆధునిక కవిత్వం మీద పరిశోధించి సిద్ధాంత గ్రంథం రచించారు. పాఠకుడిగా, పరిశోధకుడుగా తలపండిన రాధేయ విమర్శలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇదొక బృహత్ప్రణాళిక. అందులో భాగమే ఈ పుస్తకం 'అవగాహన'.
- ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
సాహితీరంగంలో కృషిచేస్తున్న కొందరు వర్తమాన కవుల వ్యక్తిత్వాలను రాధేయ ఎంతో చిత్తశుద్ధితో తమ 'అవగాహన' అన్న గ్రంథంలో చిత్రీకరించారు. ఇందులో ప్రతిభామూర్తులైన సాహితీవేత్తలను గురించిన వ్యాసాలున్నాయి. వారి కవితా సంపుటాల నుంచి విస్తృతంగా ఉదాహరణలను ఇవ్వటం కూడా జరిగింది. దీంతో పాఠకుడికి ఆ కవిని గూర్చిన పూర్తి అవగాహన ఏర్పడిందని చెప్పవచ్చు. ఎంతో ఓపికతో విషయసేకరణ చేసి వ్యాస పరంపరను పూలబాణాలుగా సంధించిన డా రాధేయకు నా అభినందనలు. - డా అమ్మంగి వేణుగోపాల్ కవిగా, కవిత్వ పాఠకునిగా, కవిత్వ విమర్శకునిగా రాధేయ రాటుదేలినవారు. ఆధునిక కవిత్వం మీద పరిశోధించి సిద్ధాంత గ్రంథం రచించారు. పాఠకుడిగా, పరిశోధకుడుగా తలపండిన రాధేయ విమర్శలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇదొక బృహత్ప్రణాళిక. అందులో భాగమే ఈ పుస్తకం 'అవగాహన'. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.