ఎరిక్ హబ్స్ బామ్ 1917 జూన్ 9న అలెగ్జాండ్రియాలో జన్మించారు. బ్రిటిష్ చరిత్రకారుడు. సామాజిక వేత్త, రచయిత, మార్క్సిస్టు దృక్పధంతో చరిత్రను అధ్యయనం చేశారు. ఆయన ప్రముఖ రచనలు - 'సుదీర్ఘ పంతొమ్మిదవ శతాబ్దం', అతిశయాల యుగం. ప్రపంచ ప్రజలను పెద్ద పెద్ద అలజడులకు గురి చేసిన యుగం గురించే ఈ రచనలు. ప్రపంచ చరిత్రను పై రెండు భాగాలుగా విభజించి యూరప్ లో 19వ శతాబ్దంలో జరిగిన మార్పులకు అక్షర రూపాన్నిచ్చారు. విషయాన్ని లోతుగా చర్చిడంలోనూ, సరళంగా చదువరులకు అందించడంలోనూ హాబ్స్ బామ్ సిద్ధహస్తులు.
యూరప్ లో నివసిస్తున్న ప్రతివ్యక్తి జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద విప్లవాలు - ఫ్రెంచి విప్లవం, బ్రిటన్ లోని పారిశ్రామిక విప్లవం - వాటిని ఎలా మార్చివేసాయో విజ్ఞానాత్మకంగా హాబ్స్ బామ్ వివరించారు. పశ్చిమ యూరప్ పారిశ్రామిక పెట్టుబడిదారి విధానాన్ని ఏర్పరచి, ప్రపంచం పై తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు, ఆశక్తిదాయకంగా వివరించారు. ఇది శక్తివంతమైన విశ్లేషణతో, వివరణతో, అవగాహనతో కూడినదేకాదు. శాస్త్రీయ ఆవిష్కరణలను కూడా జోడించి ఎంతో సుందరంగా, ఒక నవలలాగా సరళంగా రూపొందించారు.
- ఇంగ్లీష్ హిస్టారికల్ రివూ
ఎరిక్ హబ్స్ బామ్ 1917 జూన్ 9న అలెగ్జాండ్రియాలో జన్మించారు. బ్రిటిష్ చరిత్రకారుడు. సామాజిక వేత్త, రచయిత, మార్క్సిస్టు దృక్పధంతో చరిత్రను అధ్యయనం చేశారు. ఆయన ప్రముఖ రచనలు - 'సుదీర్ఘ పంతొమ్మిదవ శతాబ్దం', అతిశయాల యుగం. ప్రపంచ ప్రజలను పెద్ద పెద్ద అలజడులకు గురి చేసిన యుగం గురించే ఈ రచనలు. ప్రపంచ చరిత్రను పై రెండు భాగాలుగా విభజించి యూరప్ లో 19వ శతాబ్దంలో జరిగిన మార్పులకు అక్షర రూపాన్నిచ్చారు. విషయాన్ని లోతుగా చర్చిడంలోనూ, సరళంగా చదువరులకు అందించడంలోనూ హాబ్స్ బామ్ సిద్ధహస్తులు. యూరప్ లో నివసిస్తున్న ప్రతివ్యక్తి జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద విప్లవాలు - ఫ్రెంచి విప్లవం, బ్రిటన్ లోని పారిశ్రామిక విప్లవం - వాటిని ఎలా మార్చివేసాయో విజ్ఞానాత్మకంగా హాబ్స్ బామ్ వివరించారు. పశ్చిమ యూరప్ పారిశ్రామిక పెట్టుబడిదారి విధానాన్ని ఏర్పరచి, ప్రపంచం పై తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు, ఆశక్తిదాయకంగా వివరించారు. ఇది శక్తివంతమైన విశ్లేషణతో, వివరణతో, అవగాహనతో కూడినదేకాదు. శాస్త్రీయ ఆవిష్కరణలను కూడా జోడించి ఎంతో సుందరంగా, ఒక నవలలాగా సరళంగా రూపొందించారు. - ఇంగ్లీష్ హిస్టారికల్ రివూ© 2017,www.logili.com All Rights Reserved.