భవిష్యత్తులో ఏం జరగవచ్చన్న అంశాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి మనందరికీ ఉంటుంది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకునే ఎవరైనా రాబోయే కాలాన్ని గురించి అంచనాలు వేస్తారు. రేపు జరగబోయే పరిణామాలకు నిన్నటి సంఘటనలకు మధ్యన ఎంతో కొంత సంబంధముంటుంది. తమ విజ్ఞానాన్ని, మేథస్సును ఉపయోగించి చరిత్రకారులు తమ ఊహాగానాలు చేస్తారు. గత కాలపు ముఖ్య ఘటనలు, సమస్యలు, ప్రక్రియల్ని గమనంలోకి తీసుకొని వీరు రేపటి అంచనాల్ని రూపొందిస్తారు. ఇవి యధాతథంగా జరిగి తీరతాయన్న హామీ ఏమీ లేదు. ఎందుకంటే చరిత్రకారుల పని జోస్యం చెప్పటం కాదు కదా! వాస్తవానికి రాబోయే రోజుల పైన ఖచ్చితమైన సమాచారాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ఫలానా విధంగా జరిగేందుకు అవకాశమున్నదని మాత్రమే వారు అంచనా కట్టగలరు. ఈ పూర్వ రంగాన 20వ శతాబ్దపు అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని నూతన శతాబ్దాన జన జీవితం ఏ విధంగా ఉండబోతున్నదో ప్రముఖ చరిత్రకారులు ఎరిక్ హాబ్స్ బామ్ నడిగి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
భవిష్యత్తులో ఏం జరగవచ్చన్న అంశాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి మనందరికీ ఉంటుంది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకునే ఎవరైనా రాబోయే కాలాన్ని గురించి అంచనాలు వేస్తారు. రేపు జరగబోయే పరిణామాలకు నిన్నటి సంఘటనలకు మధ్యన ఎంతో కొంత సంబంధముంటుంది. తమ విజ్ఞానాన్ని, మేథస్సును ఉపయోగించి చరిత్రకారులు తమ ఊహాగానాలు చేస్తారు. గత కాలపు ముఖ్య ఘటనలు, సమస్యలు, ప్రక్రియల్ని గమనంలోకి తీసుకొని వీరు రేపటి అంచనాల్ని రూపొందిస్తారు. ఇవి యధాతథంగా జరిగి తీరతాయన్న హామీ ఏమీ లేదు. ఎందుకంటే చరిత్రకారుల పని జోస్యం చెప్పటం కాదు కదా! వాస్తవానికి రాబోయే రోజుల పైన ఖచ్చితమైన సమాచారాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ఫలానా విధంగా జరిగేందుకు అవకాశమున్నదని మాత్రమే వారు అంచనా కట్టగలరు. ఈ పూర్వ రంగాన 20వ శతాబ్దపు అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని నూతన శతాబ్దాన జన జీవితం ఏ విధంగా ఉండబోతున్నదో ప్రముఖ చరిత్రకారులు ఎరిక్ హాబ్స్ బామ్ నడిగి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.© 2017,www.logili.com All Rights Reserved.