చరిత్రకి మూలం రాతయైతే, తెలుగువారి చరిత్ర ఈనాటిది కాదు. అశోకుని శాసనాలకు ముందే భట్టిప్రోలులో లభించిన ప్రాకృత లిపిలో తెలుగు 'తలకట్టు' కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆగ్నేయాసియా దేశాల్లో నాగరికత విస్తరణకి కృష్ణా గోదావరీ తీరాలే మూలస్థానం. శాతవాహన, ఇక్ష్వాకు, వేంగి, పల్లవ, కాకతీయ, చోడ, విజయనగర రాజ్యాలు దేశ రాజకీయాలనే గాక, ప్రపంచ వాణిజ్యాన్ని నిర్దేశించాయి. ప్రాచీన భారతీయ సంస్కృతి అంతరించకుండా కాపు కాసింది తెలుగువారే.
కాలగమనంలోని పరిణామాలకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకుంటూ పొరుగు సంస్కృతుల పట్ల సమన్వయంతో వ్యవహరించడం మనకి కొత్తేమీ కాదు. ప్రాంతీయ తత్వం, భాషా దురభిమానం వెర్రితలలు వేస్తున్న నేపథ్యంలో, తెలుగు ప్రజల సామరస్య ధోరణి మన చారిత్రక ఘనత మరుగు పడేందుకు కారణమయింది. చారిత్రక సాహిత్యం కరువయింది. చరిత్రలో ఏమున్నది గర్వకారణం, అనే నిర్లిప్త భావన నేటి తెలుగువారిలోలా మరేవరిలోనూ కనిపించదు. ఈ అవగాహన లోపాన్ని సరిదిద్ధాలంటే, మనలో చరిత్రపట్ల నిద్రాణమై ఉన్న ఆసక్తిని ఎవరైనా తట్టిలేపాలి. ఆ దిశలో చేస్తున్న మరో ప్రయత్నమే.... ఆంధ్రప్రథం చరిత్రలోకి ప్రయాణంలో మైలురాళ్ళలా మన సంస్కృతి అద్దంపట్టే 27 కథలూ, వాటి నేపథ్యాన్ని వివరించే కథనాలు.
- సాయి పాపినేని
చరిత్రకి మూలం రాతయైతే, తెలుగువారి చరిత్ర ఈనాటిది కాదు. అశోకుని శాసనాలకు ముందే భట్టిప్రోలులో లభించిన ప్రాకృత లిపిలో తెలుగు 'తలకట్టు' కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆగ్నేయాసియా దేశాల్లో నాగరికత విస్తరణకి కృష్ణా గోదావరీ తీరాలే మూలస్థానం. శాతవాహన, ఇక్ష్వాకు, వేంగి, పల్లవ, కాకతీయ, చోడ, విజయనగర రాజ్యాలు దేశ రాజకీయాలనే గాక, ప్రపంచ వాణిజ్యాన్ని నిర్దేశించాయి. ప్రాచీన భారతీయ సంస్కృతి అంతరించకుండా కాపు కాసింది తెలుగువారే. కాలగమనంలోని పరిణామాలకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకుంటూ పొరుగు సంస్కృతుల పట్ల సమన్వయంతో వ్యవహరించడం మనకి కొత్తేమీ కాదు. ప్రాంతీయ తత్వం, భాషా దురభిమానం వెర్రితలలు వేస్తున్న నేపథ్యంలో, తెలుగు ప్రజల సామరస్య ధోరణి మన చారిత్రక ఘనత మరుగు పడేందుకు కారణమయింది. చారిత్రక సాహిత్యం కరువయింది. చరిత్రలో ఏమున్నది గర్వకారణం, అనే నిర్లిప్త భావన నేటి తెలుగువారిలోలా మరేవరిలోనూ కనిపించదు. ఈ అవగాహన లోపాన్ని సరిదిద్ధాలంటే, మనలో చరిత్రపట్ల నిద్రాణమై ఉన్న ఆసక్తిని ఎవరైనా తట్టిలేపాలి. ఆ దిశలో చేస్తున్న మరో ప్రయత్నమే.... ఆంధ్రప్రథం చరిత్రలోకి ప్రయాణంలో మైలురాళ్ళలా మన సంస్కృతి అద్దంపట్టే 27 కథలూ, వాటి నేపథ్యాన్ని వివరించే కథనాలు. - సాయి పాపినేని© 2017,www.logili.com All Rights Reserved.