ప్రత్యేక జీవనవిధానం గల మానవుల సామూహిక స్థితి సమాజం. ప్రపంచంలో భాగం అది. ప్రపంచం, దానిలో భాగమైన సమాజం అవాస్తవం కాదు. భౌతికంగా ఉనికి కలిగిన సమస్తం వాస్తవమే.
వస్తువు యొక్క స్వభావమే వాస్తవికత. వస్తువు అంటే యిక్కడ కేవలం ప్రపంచంలో కనపడే పదార్థ సముదాయం అని ప్రాథమికంగా అనుకోవచ్చు. భౌతికంగా ఉనికి కలిగిన సమస్తం వాస్తవమే. ఈ వాస్తవ ప్రపంచంలోని సమస్త దృగంశాలు ఒక దశ నుంచి మరొక దశకి మారుతున్నాయి. మార్పు చెందని వస్తువు ప్రపంచంలో లేదు. ఎల్లప్పుడూ మారుతూనే ప్రపంచం 'ఉండ'గలుగుతున్నది. ఈ నిరంతర పరిణామశీలాన్ని బౌద్ధ దర్శనం గుర్తించింది. భౌతిక రూపాలే కాక, ఆలోచన, మనస్సు, చైతన్యం - అన్నీ మారేవే అన్నాడు బుద్ధుడు.
- డా. పాపినేని శివశంకర్