వేల ఏళ్ల నుంచి భారత భూభాగంలోకి అనేక తెగలు వచ్చి చేరాయి. వారిలో ఒకరిద్దరు తప్పి మిగిలినవారంతా ఈ గడ్డని సొంతం చేసుకొని ఇక్కడే స్థిరపడ్డారు. భారతీయ సంస్కృతికి వైవిధ్యాన్ని చేకూర్చారు. సింధు నాగరికతవాసులు, ద్రావిడులు, ఆర్యులు, యవనులు, తోకరియన్లు, శకులు, హుణులు, పారశీకులు, టర్కులు, మొగాలులు - ఒకరా? ఎందరో వచ్చారు. వారు మూలవాసులతోనే కాక, తమలో తాము కూడా ఘర్షణ పడ్డారు. అంతిమంగా భారతీయతను సంతరించుకున్నారు. చివరిలో వచ్చిన యూరోపియన్లే ఇందుకు మినహాయింపు. భారత దేశం వివిధ జాతుల సంస్కృతుల భాషల అందమైన హరివిల్లు. అందుకు పునాది సింధు నాగరికత అంటారు, రచయిత.
- మర్ల విజయకుమార్