మైసూరు. ఎన్నో తరాల కథలను తనలో ఇముడ్చుకుని, పెదవి విప్పకుండా హుందాగా నిలబడి ఉన్న ఓ అబ్బురపరిచే చరిత్ర కావ్యం. నగరాన్ని ఆనుకుని హుందాగా కనిపించే చాముండి హిల్ "నేనున్నా నీకు" అని భరోసా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది.
చాముండి హిల్ నీడలో హుందాగా పలకరిస్తుంది "దిల్ కుష్ కాటేజ్”. పేరుకు తగినట్టే హృదయానికి ఆనందం కలిగించి రంజింప చేసే ప్రత్యేకత ఏదో ఉంది దిల్ కుష్. రాయల్ బంగ్లా అనిపించుకునేలా చుట్టూ తోటలు, ఫౌంటెన్లు ఏమీ లేవు. కానీ ఏదో సౌఖ్యం, ఏదో ఓ రాజసం, అతిధులుగా తన గడప తొక్కిన వారికి ఆప్యాయతను పంచి ఇవ్వగల ఏదో లాలిత్యం ఉంది. వినిపించని ఏదో మాధుర్యం చిప్పిరిల్లే గమకం ఉంది ఆ స్వరంలో.
గుర్రపు బగ్గీ, దిల్ కుష్ కాటేజ్ ఉన్న గుట్ట మీదకి మెల్లగా వచ్చి, గుమ్మంలో ఆగింది. బాటకి ఇరువైపులా బోగన్ విలియాలు గుత్తులుగా విరబూసి, స్వాగతం చెబుతున్నట్టుగా చిరునవ్వులు చిందిస్తున్నాయి.
రంగురంగులుగా అలంకరించి ఉన్న బగ్గీకి ముందున్న రెండుతలల గండభేరుండపక్షి బొమ్మ మైసూరు రాజచిహ్నం, హుందాగా పలకరిస్తోంది. దాని అర్థం బగ్గీలో ప్రయాణిస్తున్నది మైసూరు సంస్థానానికి అధికార హోదాలో విచ్చేసిన అతిథి అని.
రాయల్ గెస్ట్. అవును. జుట్టు వెనక్కు అలసటగా తోసుకుంటూ తన స్థూల శరీరాన్ని బగ్గీ లోంచి మెల్లగా కిందకి దించుకుని, కళ్ళజోడు సర్దుకుంటూ, రెండు వైపులా ఇద్దరు అసిస్టెంట్లు ఆసరాగా నిలబడగా, దిల్ కుష్ ప్రాంగణంలో పాదం మోపింది ఆమె. ఇద్దరిలో ఒకరు, పెద్దగా వయసు లేని యువతి కాగా, అతడు నవాబు గడ్డంతో మంకీ క్యాప్తో ఆమెని ఒక నమ్మిన బంటులా అనుసరిస్తున్నాడు. బగ్గీలోని లగేజి చకచకా దింపి లోపల పెట్టిస్తూ పురమాయిస్తున్నాడు.
"రెహమాన్ మియా! లగేజి జాగ్రత్త! మెల్లగా దించాలి. అవన్నీ విలువైన వస్తువులు. కాస్త చూసుకుని సర్దండి" ఆమె గొంతులో అలసటతో పాటు ఇంకేదో ధ్వనిస్తోంది. అది గాంభీర్యమా లేక కోమలత్వమా? లేక జీవితపు పరుగులో స్పందనలకు ఎగువగా మిగిలిపోయిన ఓ అబల నిర్వికల్ప నిశ్వాస స్వరమా? మైసూరు గాలి నేటికీ ఆ ఊసులు నెమరు వేసుకుంటూనే ఉంటుంది................
గౌహర్, ఏమైంది నీకు? మైసూరు, (ఆగస్టు 1928) మైసూరు. ఎన్నో తరాల కథలను తనలో ఇముడ్చుకుని, పెదవి విప్పకుండా హుందాగా నిలబడి ఉన్న ఓ అబ్బురపరిచే చరిత్ర కావ్యం. నగరాన్ని ఆనుకుని హుందాగా కనిపించే చాముండి హిల్ "నేనున్నా నీకు" అని భరోసా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాముండి హిల్ నీడలో హుందాగా పలకరిస్తుంది "దిల్ కుష్ కాటేజ్”. పేరుకు తగినట్టే హృదయానికి ఆనందం కలిగించి రంజింప చేసే ప్రత్యేకత ఏదో ఉంది దిల్ కుష్. రాయల్ బంగ్లా అనిపించుకునేలా చుట్టూ తోటలు, ఫౌంటెన్లు ఏమీ లేవు. కానీ ఏదో సౌఖ్యం, ఏదో ఓ రాజసం, అతిధులుగా తన గడప తొక్కిన వారికి ఆప్యాయతను పంచి ఇవ్వగల ఏదో లాలిత్యం ఉంది. వినిపించని ఏదో మాధుర్యం చిప్పిరిల్లే గమకం ఉంది ఆ స్వరంలో. గుర్రపు బగ్గీ, దిల్ కుష్ కాటేజ్ ఉన్న గుట్ట మీదకి మెల్లగా వచ్చి, గుమ్మంలో ఆగింది. బాటకి ఇరువైపులా బోగన్ విలియాలు గుత్తులుగా విరబూసి, స్వాగతం చెబుతున్నట్టుగా చిరునవ్వులు చిందిస్తున్నాయి. రంగురంగులుగా అలంకరించి ఉన్న బగ్గీకి ముందున్న రెండుతలల గండభేరుండపక్షి బొమ్మ మైసూరు రాజచిహ్నం, హుందాగా పలకరిస్తోంది. దాని అర్థం బగ్గీలో ప్రయాణిస్తున్నది మైసూరు సంస్థానానికి అధికార హోదాలో విచ్చేసిన అతిథి అని. రాయల్ గెస్ట్. అవును. జుట్టు వెనక్కు అలసటగా తోసుకుంటూ తన స్థూల శరీరాన్ని బగ్గీ లోంచి మెల్లగా కిందకి దించుకుని, కళ్ళజోడు సర్దుకుంటూ, రెండు వైపులా ఇద్దరు అసిస్టెంట్లు ఆసరాగా నిలబడగా, దిల్ కుష్ ప్రాంగణంలో పాదం మోపింది ఆమె. ఇద్దరిలో ఒకరు, పెద్దగా వయసు లేని యువతి కాగా, అతడు నవాబు గడ్డంతో మంకీ క్యాప్తో ఆమెని ఒక నమ్మిన బంటులా అనుసరిస్తున్నాడు. బగ్గీలోని లగేజి చకచకా దింపి లోపల పెట్టిస్తూ పురమాయిస్తున్నాడు. "రెహమాన్ మియా! లగేజి జాగ్రత్త! మెల్లగా దించాలి. అవన్నీ విలువైన వస్తువులు. కాస్త చూసుకుని సర్దండి" ఆమె గొంతులో అలసటతో పాటు ఇంకేదో ధ్వనిస్తోంది. అది గాంభీర్యమా లేక కోమలత్వమా? లేక జీవితపు పరుగులో స్పందనలకు ఎగువగా మిగిలిపోయిన ఓ అబల నిర్వికల్ప నిశ్వాస స్వరమా? మైసూరు గాలి నేటికీ ఆ ఊసులు నెమరు వేసుకుంటూనే ఉంటుంది................© 2017,www.logili.com All Rights Reserved.