గ్రామజీవనమే కథా వస్తువుగా తీసుకుని మోతుబరీ భూస్వాముల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి పూటకు గతిలేని కష్టజీవుల దయనీయ జీవిత గాధలను కండ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తూ బలవంతులు బలహీనులపై చూపే పాశవిక ప్రవృత్తినీ, కర్కశ కఠిన మనస్తత్వాలను తూర్పారపట్టి, ఎంతో రసభరితంగా బహిర్గతం చేసిన పరమ కరుణారస హృదయులు శ్రీ కరుణ కుమార. అయన గతించగా ఇక ఆంధ్ర కథా సాహిత్యానికి మిగిలినవి ఆయన కథలే. అప్పుడీ కథలు ఉదయిని, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కిన్నెర, స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురితమైనాయి. అప్రకటితములుగా కూడా మిగిలిపోయాయి కొన్ని.
ఆంధ్రదేశంలో అడుగునపడియున్న ఉత్తమ సాహిత్యాన్ని అచ్చోత్తించి పాఠక లోకానికి అందించడం వారి ఉన్నతాశయం. ముందు కూడా తెలుగు సాహిత్య లోకాన్ని మరింత సుసంపన్నం చేయగలరని విశ్వసిస్తున్నాను.
- ఇవటూరి కామేశ్వరరావు
గ్రామజీవనమే కథా వస్తువుగా తీసుకుని మోతుబరీ భూస్వాముల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి పూటకు గతిలేని కష్టజీవుల దయనీయ జీవిత గాధలను కండ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తూ బలవంతులు బలహీనులపై చూపే పాశవిక ప్రవృత్తినీ, కర్కశ కఠిన మనస్తత్వాలను తూర్పారపట్టి, ఎంతో రసభరితంగా బహిర్గతం చేసిన పరమ కరుణారస హృదయులు శ్రీ కరుణ కుమార. అయన గతించగా ఇక ఆంధ్ర కథా సాహిత్యానికి మిగిలినవి ఆయన కథలే. అప్పుడీ కథలు ఉదయిని, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కిన్నెర, స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురితమైనాయి. అప్రకటితములుగా కూడా మిగిలిపోయాయి కొన్ని. ఆంధ్రదేశంలో అడుగునపడియున్న ఉత్తమ సాహిత్యాన్ని అచ్చోత్తించి పాఠక లోకానికి అందించడం వారి ఉన్నతాశయం. ముందు కూడా తెలుగు సాహిత్య లోకాన్ని మరింత సుసంపన్నం చేయగలరని విశ్వసిస్తున్నాను. - ఇవటూరి కామేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.