చారువసంతం ఇప్పటికే కన్నడ భాషలోంచి హిందీ, మరాఠీ, ఒడియా భాషల్లోకి అనువదింపబడి జన ప్రియతను గడిస్తూ ఉండటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఇప్పుడే నాకు తోడబుట్టిన తమ్ముడులా వుండే చంద్రశేఖరరెడ్డిగారు తెలుగు భాషలోనికి అనువదిస్తుండటం, నాకు ఈ క్రియ ఎంతో ఆనందం కలిగిస్తోంది.చంద్రశేఖరరెడ్డి గారు తెలుగు కన్నడాలు రెంటిలోనూ సమాన ప్రభుత్వం కలిగినవారు. ఇప్పటికే ఆయన కన్నడలోని మహత్వ పూర్ణకవ్యాల్నీ, కావ్యభాగాల్నీ తెలుగులోనికి తెచ్చుకొన్నారు. అలాగే తెలుగు కృతుల్ని కన్నడంలోనికి అనువదించారు. మంచి పేరు గడించారు. తెలుగుభాషలో సహజ కవియైన చంద్రశేఖరరెడ్డి గారు, స్వతంత్రమూ, సుదీర్ఘమూ, చారిత్రక, మహత్వ పూర్ణకావ్యాలను రచించి జానానురాగాన్ని చూరగొన్నారు. చారువసంత కావ్యం మూలానికి ఎక్కడా ఏ మాత్రమూ భంగం వాటిల్లకుండాలన్న తపనతో ఆయన ఎంతగానో శ్రమించారు.
ఇది రాజు-రాణుల కావ్యం కాదు. యుద్ధముఖి కథనమూ కాదు. మానవస్వభావంలోని విన్యాసాల పొరల్లో ప్రకటితమవుతూ, మతాతీతంగా, మహోన్నతమానవీయ విలువలతో కూడిన జనముఖంగానూ, సమాజముఖంగానూ సాగిన కావ్యమిది. ఈ అమర ప్రేమ ఆఖ్యానం వ్యవహార భాషకి చేరువగా ఒక విధమైన లయతో వెలువడిన కావ్యం మిమ్మల్ని ఆకర్షించగలదన్న ఆశతోవున్నాను.
- శ్రీ హంపన
చారువసంతం ఇప్పటికే కన్నడ భాషలోంచి హిందీ, మరాఠీ, ఒడియా భాషల్లోకి అనువదింపబడి జన ప్రియతను గడిస్తూ ఉండటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఇప్పుడే నాకు తోడబుట్టిన తమ్ముడులా వుండే చంద్రశేఖరరెడ్డిగారు తెలుగు భాషలోనికి అనువదిస్తుండటం, నాకు ఈ క్రియ ఎంతో ఆనందం కలిగిస్తోంది.చంద్రశేఖరరెడ్డి గారు తెలుగు కన్నడాలు రెంటిలోనూ సమాన ప్రభుత్వం కలిగినవారు. ఇప్పటికే ఆయన కన్నడలోని మహత్వ పూర్ణకవ్యాల్నీ, కావ్యభాగాల్నీ తెలుగులోనికి తెచ్చుకొన్నారు. అలాగే తెలుగు కృతుల్ని కన్నడంలోనికి అనువదించారు. మంచి పేరు గడించారు. తెలుగుభాషలో సహజ కవియైన చంద్రశేఖరరెడ్డి గారు, స్వతంత్రమూ, సుదీర్ఘమూ, చారిత్రక, మహత్వ పూర్ణకావ్యాలను రచించి జానానురాగాన్ని చూరగొన్నారు. చారువసంత కావ్యం మూలానికి ఎక్కడా ఏ మాత్రమూ భంగం వాటిల్లకుండాలన్న తపనతో ఆయన ఎంతగానో శ్రమించారు. ఇది రాజు-రాణుల కావ్యం కాదు. యుద్ధముఖి కథనమూ కాదు. మానవస్వభావంలోని విన్యాసాల పొరల్లో ప్రకటితమవుతూ, మతాతీతంగా, మహోన్నతమానవీయ విలువలతో కూడిన జనముఖంగానూ, సమాజముఖంగానూ సాగిన కావ్యమిది. ఈ అమర ప్రేమ ఆఖ్యానం వ్యవహార భాషకి చేరువగా ఒక విధమైన లయతో వెలువడిన కావ్యం మిమ్మల్ని ఆకర్షించగలదన్న ఆశతోవున్నాను. - శ్రీ హంపన
© 2017,www.logili.com All Rights Reserved.