ఎవరికి వారు... తానే ప్రపంచమని భ్రమింపజేసిన 'ప్రపంచీకరణ' గుట్టురట్టవుతున్న సమయమిది. కలిసి నడవడమే కావాలిప్పుడు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం జడలు విప్పుతున్న కాలమిది. శ్రమ దోపిడీ, నిరుద్యోగం, ధరాభారం పెరగడమే కాదు.. మహిళల మీద దాడులు, కుల దురహంకారం పెచ్చరిల్లుతున్న కాలం. మరోవైపు స్వదేశీ బడాబాబులు, విదేశీ బహుళజాతి సంస్థల సేవలో తరిస్తున్నారు పాలకులు. జాతీయోద్యమంతో అణుమాత్రం సంబంధం లేకపోవడమే కాదు.. తెల్ల దొరల సేవలో తరించిన వారసత్వం పుణికి పుచ్చుకున్న నేతల పాలనలో ఉన్నాం. ఇందుకు పూర్తి భిన్నంగా... స్వాతంత్ర్యోద్యమంతో మమేకమై, జమీందారీ వ్యవస్థ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎర్ర సూర్యుల ధీర చరితలు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇందుకు బాగా ఉపయోగపడే అమరుల వీరత్వం, విలువల శిల్పమే ఈ గ్రంథం.