మన గ్రామాల కైఫీయత్ లను సేకరించిన కర్నల్ కాలిన్ మెకంజీ మహాశయుడు మనకు చిరస్మరణీయుడు . ఆయన సేకరించిన కైఫీయత్తులలో కొండమీద కైఫీయత్ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో నభూతోనభవిష్యతి అన్న విధంగా రూపుదిద్దుకుంది. ఈ పుస్తకానికి విశేషాలనేకం వున్నాయి. రవికృష్ణ పాఠకులకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ప్రస్తుతం వాడుకలో లేని ప్రతి పదానికి ఫ్యూటనోట్స్ రూపొందించడం ఒక విశిష్టత. కైఫీయత్తులను నేటి కాలానికి ఎలా ప్రచురించాలి అనేదానికి ఈ కొండవీటి కైఫీయత్ ఒక నమూనా అని నా భావన. వర్తమానకాలంలో ఇలాంటి గ్రంధం ఆవశ్యకత ఎంతైనా వుందని నేను భావిస్తున్నాను.