ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ చరిత్ర పుస్తకాలలో పొందుపరచిన అంశాలే. అయితే అంశం ఒకటే అయినా దాన్ని చూసే దృక్కోణం బట్టి అది తెలిసే సత్యస్వరూపం మారుతుంది. ఏ సత్యం ప్రకటించటం ద్వారా ప్రజలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందో, ఆత్మగౌరవం హెచ్చుతుందో, వారి ఆలోచనలకొక దిశ వస్తుందో ఆ కోణంలో సంఘటనలను దర్శించి విశ్లేషించటం వాంఛనీయం. చరిత్ర కేవలం నిర్జీవమైన సత్యాల సంకలనం కాదు. నిర్జీవమైన సత్యాలను, మానవ మనస్తత్వ పరిశీలన, సామాజిక మనస్తత్వ, సంస్కృతీ సాంప్రదాయాల ఆత్మతత్వాలను కలిపి ఊహిస్తే సజీవ చరిత్ర లభిస్తుంది. అటువంటి సజీవ చరిత్రను ఈ పుస్తకంలో అందించాలని ప్రయత్నించాను. నా ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలమైందో నిర్ణయించాల్సింది పాఠకులే.
ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ చరిత్ర పుస్తకాలలో పొందుపరచిన అంశాలే. అయితే అంశం ఒకటే అయినా దాన్ని చూసే దృక్కోణం బట్టి అది తెలిసే సత్యస్వరూపం మారుతుంది. ఏ సత్యం ప్రకటించటం ద్వారా ప్రజలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందో, ఆత్మగౌరవం హెచ్చుతుందో, వారి ఆలోచనలకొక దిశ వస్తుందో ఆ కోణంలో సంఘటనలను దర్శించి విశ్లేషించటం వాంఛనీయం. చరిత్ర కేవలం నిర్జీవమైన సత్యాల సంకలనం కాదు. నిర్జీవమైన సత్యాలను, మానవ మనస్తత్వ పరిశీలన, సామాజిక మనస్తత్వ, సంస్కృతీ సాంప్రదాయాల ఆత్మతత్వాలను కలిపి ఊహిస్తే సజీవ చరిత్ర లభిస్తుంది. అటువంటి సజీవ చరిత్రను ఈ పుస్తకంలో అందించాలని ప్రయత్నించాను. నా ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలమైందో నిర్ణయించాల్సింది పాఠకులే.© 2017,www.logili.com All Rights Reserved.