జాతీయోద్యమంలో మట్టినుంచి మహావీరులను, శాంతివీరులను తయారుచేసిన ఘనత మహాత్మాగాంధీదే. అహింసాయుత నిరాకరణ ఉద్యమం ప్రపంచంలోని వేనవేల సైనిక శక్తులకన్నా మిన్న అని నిరూపించిన ఐoద్రజాలికుడు మహాత్మాగాంధీ. దెబ్బకు దెబ్బ కొట్టటంలో కాదు కొట్టిన దెబ్బను సహిస్తూ కూడా ద్వేషం క్రోధం లేక అపకారికి సైతం ఉపకారం చేయటమే పరమధర్మం అని బోధించి సామాన్యులను అసామాన్యశక్తులుగా మలచిన మహత్యం మహాత్మాగాంధీది. ప్రతి ఒక్క వస్తువులోని దైవత్వాన్ని గుర్తించి, ప్రేమ ప్రవాహ తరంగాలను అవగహన చేసుకొని ప్రపంచాన్ని ప్రేమమయం చేయాలనీ తపించిన అద్భుత ప్రవక్త మహాత్మాగాంధీ. స్వీయ నియంత్రణతో నైతిక విలువల పాలన పరమధర్మంగా కర్తవ్యనిష్ట పూజగా ధర్మపాలన పరామలక్ష్యంగా ఉత్తమ మానవ వ్యక్తిత్వ నిర్మాణానికి ఉద్యమించినా మహానుభావుడు మహాత్మాగాంధీ. తాను నమ్మింది పదిమందికి బోధించటమేకాక నిత్యజీవితంలో తు. చ. తప్పకుందాం ఆచరించి, సమాజ సంస్కరణ వ్యక్తిత్వ నిర్మాణం ఆధ్యాత్మికతలను కలగలిపి ఉత్తమ సమాజ సాధనకు ఉత్తమ పౌరుల నిర్మాణానికి బంగారు బాటలు వేసి మార్గ నిర్దేశనం చేసిన మహానుభావుడు జాతిపిత మహాత్మాగాంధీ. అయన రాజకీయ నాయకుడిగా చలామణి అవటం సమకాలీన పరిస్థితులు తప్ప మరొకటి కాదు. ప్రధానంగా భారతీయ ఆధ్యాతిమిక శక్తి నిర్మాణ తత్వానికి ప్రతీక మహాత్మాగాంధీ.
అలాంటి మహాత్మాగాంధీ జీవితాన్ని ఆదర్శాలను సిద్ధాంతాలను ప్రతిబింబించే తెలుగు కథల సంకలనం "తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు".
- కస్తూరి మురళీకృష్ణ,
కోడిహళ్ళి మురళీమోహన్