"కార్ల్ మర్క్స్ కాలానికి పెట్టుబడితో ప్రారంభమైన పరాయీకరణ, మన దేశాన్ని అధికారికంగానే ప్రపంచ మార్కెట్ శాసించే కాలానికి ఎంత విశ్వరూపం తీసుకున్నదో అవగాహనకు తెచ్చుకుని రచయిత రాసిన ఈ వ్యాసాలు చదవాలి. ఒక దినపత్రికలో ఆయా సందర్భాల్లో తక్షణ సంఘటనలకు, పరిణామాలకు స్పందించి రాసినట్లుగా కనిపించే ఈ వ్యాసాల వెనుక మార్కండేయ పుట్టిన గడ్డ 1967 నుంచి అనుభవించిన, ప్రతిఘటించిన, నిర్మించిన చరిత్ర, ఆ క్రమంలో ప్రజలు నిర్మిస్తున్న చరిత్ర ఉన్నది".
"ప్రకృతి సంపద, మానవ శ్రమ కోసం పెట్టుబడి వేటకు ఇవ్వాలటి పేరు ప్రపంచీకరణ. అందులోని పరాయీకరణను రచయిత పట్టుకున్న పద్ధతి ఎంతో శాస్త్రీయంగా ఉన్నది. సాధికారికంగా ఉన్నది".
"మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో పనిచేసే వాళ్లు కూడా పంక్తుల మధ్యన ప్రపంచీకరణ వలన పరాయీకరణకు గురవుతున్న ప్రజల గురించి ఎంత వేదనను, ఎంత వెలుగును ప్రసరించవచ్చునో ఈ వ్యాసాలు కూడా ఒక తార్కాణం".
- డి. మార్కండేయ