1.కల
"యువర్ అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నంబర్ వన్ జీరో, టూ జీరో హౌరా మెడ్రాస్ మెయిల్ ఇజ్ రన్నింగ్ లేట్ బై వన్ అవర్... దయచేసి వినండి ట్రయిన్ నంబర్ ఒకటి సున్నా, రెండు సున్నా హౌరా నుండి మద్రాసు వెళ్ళే మెయిల్ ఒక గంట ఆలస్యముగా నడుచుచున్నది. అసౌకర్యానికి చింతిస్తున్నాము”.
శ్రీధరకు రైలు ప్రయాణం ఎప్పుడూ కొత్త కాదు. కాని, విశాఖపట్టణం వెళ్ళడం కొంత కొత్త. కొత్త అంటే గతంలో ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన జ్ఞాపకాలు. ఆనందం, ఉద్వేగం, ఉత్సాహం కలిసిపోయిన జ్ఞాపకాలు. ఇప్పుడు వెళుతున్నది. పెళ్ళికో, చుట్టపు చూపులకో కాదు. యూనివర్శిటీలో చదవడానికి. శ్రీధర్ ఎప్పుడూ ఆ రోజును మరచిపోడు. అప్పటికే అతడు ఎం.ఏ. కోర్సులో చేరడం గురించి ఆసెట్ గా పిలవబడే ఆంధ్రా యూనివర్శిటీలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసి ఫలితాల గురించి ఎదురు చూస్తున్నాడు. రెండు వారాల క్రితం ఒక రోజు ఉదయం గంతులేస్తూ తనవద్దకు వచ్చి తన చెల్లాయి దినపత్రిక చూసి “రేయ్ అన్నాయ్, ఆసెట్ (AUCET) ఫలితాలు చదువుతా విను” అంటే, శ్రీధర్ లో అనిశ్చితి చోటుచేసుకుంది. భయంతో మనసు మూగవోయింది. ఉపాధ్యాయుడైన తండ్రి తనను ఒక లెక్చరర్‌గా చూడాలన్న కలకు భంగం కలిగితే తాను తట్టుకోలేనేమోనని భయం. అయితే అంతలోనే కాస్త ఆశాజనకం, చెల్లి గంతులు చూసి,
"ఏంటి? ఆసెట్ రిజల్టా ఆ? సరేలే నేను చూసుకుంటాను. పేపరు ఇటు ఇవ్వు..." అని అడిగాడు శ్రీధర్
“ఏంటి నీవు చూసేది... నీ పేరు వెతికి పెట్టా.” అంది చెల్లాయి లలిత | “పేరేంటి వెర్రి ముఖమా... నంబర్ లేదా ఏంటీ?” ఆతృతతో ప్రశ్నించాడు శ్రీధర్.............
1.కల "యువర్ అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నంబర్ వన్ జీరో, టూ జీరో హౌరా మెడ్రాస్ మెయిల్ ఇజ్ రన్నింగ్ లేట్ బై వన్ అవర్... దయచేసి వినండి ట్రయిన్ నంబర్ ఒకటి సున్నా, రెండు సున్నా హౌరా నుండి మద్రాసు వెళ్ళే మెయిల్ ఒక గంట ఆలస్యముగా నడుచుచున్నది. అసౌకర్యానికి చింతిస్తున్నాము”. శ్రీధరకు రైలు ప్రయాణం ఎప్పుడూ కొత్త కాదు. కాని, విశాఖపట్టణం వెళ్ళడం కొంత కొత్త. కొత్త అంటే గతంలో ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన జ్ఞాపకాలు. ఆనందం, ఉద్వేగం, ఉత్సాహం కలిసిపోయిన జ్ఞాపకాలు. ఇప్పుడు వెళుతున్నది. పెళ్ళికో, చుట్టపు చూపులకో కాదు. యూనివర్శిటీలో చదవడానికి. శ్రీధర్ ఎప్పుడూ ఆ రోజును మరచిపోడు. అప్పటికే అతడు ఎం.ఏ. కోర్సులో చేరడం గురించి ఆసెట్ గా పిలవబడే ఆంధ్రా యూనివర్శిటీలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసి ఫలితాల గురించి ఎదురు చూస్తున్నాడు. రెండు వారాల క్రితం ఒక రోజు ఉదయం గంతులేస్తూ తనవద్దకు వచ్చి తన చెల్లాయి దినపత్రిక చూసి “రేయ్ అన్నాయ్, ఆసెట్ (AUCET) ఫలితాలు చదువుతా విను” అంటే, శ్రీధర్ లో అనిశ్చితి చోటుచేసుకుంది. భయంతో మనసు మూగవోయింది. ఉపాధ్యాయుడైన తండ్రి తనను ఒక లెక్చరర్‌గా చూడాలన్న కలకు భంగం కలిగితే తాను తట్టుకోలేనేమోనని భయం. అయితే అంతలోనే కాస్త ఆశాజనకం, చెల్లి గంతులు చూసి, "ఏంటి? ఆసెట్ రిజల్టా ఆ? సరేలే నేను చూసుకుంటాను. పేపరు ఇటు ఇవ్వు..." అని అడిగాడు శ్రీధర్ “ఏంటి నీవు చూసేది... నీ పేరు వెతికి పెట్టా.” అంది చెల్లాయి లలిత | “పేరేంటి వెర్రి ముఖమా... నంబర్ లేదా ఏంటీ?” ఆతృతతో ప్రశ్నించాడు శ్రీధర్.............© 2017,www.logili.com All Rights Reserved.