మానవ నాగరికతా చరిత్రలో మార్క్సిజం ఆవిర్భావం ఒక మూలమలుపు. మానవ నాగరికత అభివృద్ధి చెందే క్రమంలో అప్పటివరకూ సాధించిన అన్ని పాజిటివ్ అంశాలను మార్క్స్, ఎంగెల్స్ లు నిర్దిష్టం చేసి, వాటిని సంశ్లేహించారు. అదే శ్రామికవర్గ ప్రాపంచిక ద్రుక్పతమైన మార్క్సిజం ఆవిర్భావానికి దారితీసింది. ప్రపంచాన్ని వ్యాఖ్యానించడం ఒక్కటే కాక దాన్ని మార్చడమే తత్వశాస్త్ర లక్ష్యంగా ఉండాలని ఈ శ్రామిక వర్గ దృక్పథం ప్రకటించింది.
కాబట్టి అది ప్రకృతీ, సమాజాల అభివృద్ధి నియమాలను వివరించింది; సమాజాన్ని ఎలా మార్చాలో విశ్లేషించింది; సామాజిక ఆచరణ యొక్క గొప్ప ప్రాముఖ్యాన్ని ముందుకు తెచ్చింది; వర్గ రహిత సమాజ స్థాపనకు అంతిమంగా దారితీసే వర్గపోరాట ప్రాతిపదికని స్పష్టంగా సూచించింది. ఆ విధంగా ప్రపంచ శ్రామిక వర్గం ఒక శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథంతో సాయుధమయింది; ఇంకా శ్రామికవర్గం, ఇతర పీడిత వర్గాల ఉద్యామానికి ఒక విప్లవాత్మక ప్రాతిపదికని బోధించింది. నిరంతర మార్పులకు గురవుతున్న ప్రపంచానికి అనుగుణంగా మార్క్సిజం - లెనినిజం - మావోయిజం నుంచి ఈ శాస్త్రం మరింత అభివృద్ధి చెందింది.
మానవ నాగరికతా చరిత్రలో మార్క్సిజం ఆవిర్భావం ఒక మూలమలుపు. మానవ నాగరికత అభివృద్ధి చెందే క్రమంలో అప్పటివరకూ సాధించిన అన్ని పాజిటివ్ అంశాలను మార్క్స్, ఎంగెల్స్ లు నిర్దిష్టం చేసి, వాటిని సంశ్లేహించారు. అదే శ్రామికవర్గ ప్రాపంచిక ద్రుక్పతమైన మార్క్సిజం ఆవిర్భావానికి దారితీసింది. ప్రపంచాన్ని వ్యాఖ్యానించడం ఒక్కటే కాక దాన్ని మార్చడమే తత్వశాస్త్ర లక్ష్యంగా ఉండాలని ఈ శ్రామిక వర్గ దృక్పథం ప్రకటించింది. కాబట్టి అది ప్రకృతీ, సమాజాల అభివృద్ధి నియమాలను వివరించింది; సమాజాన్ని ఎలా మార్చాలో విశ్లేషించింది; సామాజిక ఆచరణ యొక్క గొప్ప ప్రాముఖ్యాన్ని ముందుకు తెచ్చింది; వర్గ రహిత సమాజ స్థాపనకు అంతిమంగా దారితీసే వర్గపోరాట ప్రాతిపదికని స్పష్టంగా సూచించింది. ఆ విధంగా ప్రపంచ శ్రామిక వర్గం ఒక శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథంతో సాయుధమయింది; ఇంకా శ్రామికవర్గం, ఇతర పీడిత వర్గాల ఉద్యామానికి ఒక విప్లవాత్మక ప్రాతిపదికని బోధించింది. నిరంతర మార్పులకు గురవుతున్న ప్రపంచానికి అనుగుణంగా మార్క్సిజం - లెనినిజం - మావోయిజం నుంచి ఈ శాస్త్రం మరింత అభివృద్ధి చెందింది.© 2017,www.logili.com All Rights Reserved.