భవిష్యత్తుకు రూట్ మ్యాప్.. 'హార్ట్ బీట్'!
ప్రతి రచయిత తాను రాసేదానికి ఏదో ప్రయోజనం ఉంటుందని రాస్తాడు. ఒక ప్రయోజనం. "To amuse, to instruct other man or to reform other man" అంటాడు రావిశాస్త్రి. సరిగ్గా ఇదే ప్రయోజనం కోసం తన గుండె గాయాలకు బ్లూ స్కార్ఫ్ చుట్టుకొని, భగత్ స్ఫూర్తితో శ్రీ శ్రీ ఆర్తితో, 'చే' లు పూసే దారిలో చేలు కాసే బాటలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, రాసిన పలు రాజకీయ సామాజిక సాంస్కృతిక ఆర్థిక అంశాల విశ్లేషణను హార్ట్ బీట్ గా మన ముందు ఉంచాడు విప్లవ్. తెలంగాణ పల్లెల నుండి ఢిల్లీ దాకా ఆయా కాలాల్లో చెలరేగిన వివిధ సామాజిక అంశాల వ్యక్తీకరణ హార్ట్ బీట్. ఒకటి రెండు చాలా పాత కాలపు వ్యాసాలు అయినా, ప్రధానంగా 2016 నుండి 2020 దాకా సాగిన పలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల కలబోత. గాయపడిన కవి గుండెల నుండి రాయబడిన కావ్యాల్లో, ఈ వ్యాస సంపుటి ముద్రితమైంది. ఇందులోని సుమారు 30 పైగా వ్యాసాలు ఆయా సందర్భాల్లో నవతెలంగాణలో ప్రచురితమైనవే. ఇంకొన్ని స్టూడెంట్ మార్చ్, స్టూడెంట్ స్ట్రగుల్, వార్త, నవశక్తి, సోపతిలో అచ్చు అయినవి.
రచయిత ప్రధానంగా, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య క్రియాశీల కార్యకర్తగా, భగత్సింగ్ చేగువేరాల స్ఫూర్తితో సావిత్రిబాయి పూలే, జితిన్దాస్లల మీద రాసిన ప్రత్యేక వ్యాసాలు ఆయన ప్రాపంచిక దృక్పథానికి నిదర్శనం. తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన వివేక్ లాంటి విద్యార్థి వీరుల్ని, విద్యుత్ పోరాట అమరుల్ని, ఈశ్వర్, పాటల బిక్షపతిల స్మరణలో తన ఆర్తిని వ్యక్తం చేస్తాడు. వందలాది విద్యార్థి వీరుల రక్తతర్పణతో ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణలో అప్రజాస్వామికత కొనసాగుతున్నదని ఆవేదన చెందుతాడు. సచివాలయ కూల్చివేత నిర్మాణం జరిగిపోతున్న సందర్భంలో, యాదగిరిగుట్ట పట్ల చూపిన శ్రద్ధ, తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన ఉస్మానియా.....................
భవిష్యత్తుకు రూట్ మ్యాప్.. 'హార్ట్ బీట్'! ప్రతి రచయిత తాను రాసేదానికి ఏదో ప్రయోజనం ఉంటుందని రాస్తాడు. ఒక ప్రయోజనం. "To amuse, to instruct other man or to reform other man" అంటాడు రావిశాస్త్రి. సరిగ్గా ఇదే ప్రయోజనం కోసం తన గుండె గాయాలకు బ్లూ స్కార్ఫ్ చుట్టుకొని, భగత్ స్ఫూర్తితో శ్రీ శ్రీ ఆర్తితో, 'చే' లు పూసే దారిలో చేలు కాసే బాటలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, రాసిన పలు రాజకీయ సామాజిక సాంస్కృతిక ఆర్థిక అంశాల విశ్లేషణను హార్ట్ బీట్ గా మన ముందు ఉంచాడు విప్లవ్. తెలంగాణ పల్లెల నుండి ఢిల్లీ దాకా ఆయా కాలాల్లో చెలరేగిన వివిధ సామాజిక అంశాల వ్యక్తీకరణ హార్ట్ బీట్. ఒకటి రెండు చాలా పాత కాలపు వ్యాసాలు అయినా, ప్రధానంగా 2016 నుండి 2020 దాకా సాగిన పలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల కలబోత. గాయపడిన కవి గుండెల నుండి రాయబడిన కావ్యాల్లో, ఈ వ్యాస సంపుటి ముద్రితమైంది. ఇందులోని సుమారు 30 పైగా వ్యాసాలు ఆయా సందర్భాల్లో నవతెలంగాణలో ప్రచురితమైనవే. ఇంకొన్ని స్టూడెంట్ మార్చ్, స్టూడెంట్ స్ట్రగుల్, వార్త, నవశక్తి, సోపతిలో అచ్చు అయినవి. రచయిత ప్రధానంగా, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య క్రియాశీల కార్యకర్తగా, భగత్సింగ్ చేగువేరాల స్ఫూర్తితో సావిత్రిబాయి పూలే, జితిన్దాస్లల మీద రాసిన ప్రత్యేక వ్యాసాలు ఆయన ప్రాపంచిక దృక్పథానికి నిదర్శనం. తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన వివేక్ లాంటి విద్యార్థి వీరుల్ని, విద్యుత్ పోరాట అమరుల్ని, ఈశ్వర్, పాటల బిక్షపతిల స్మరణలో తన ఆర్తిని వ్యక్తం చేస్తాడు. వందలాది విద్యార్థి వీరుల రక్తతర్పణతో ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణలో అప్రజాస్వామికత కొనసాగుతున్నదని ఆవేదన చెందుతాడు. సచివాలయ కూల్చివేత నిర్మాణం జరిగిపోతున్న సందర్భంలో, యాదగిరిగుట్ట పట్ల చూపిన శ్రద్ధ, తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన ఉస్మానియా.....................© 2017,www.logili.com All Rights Reserved.