గతం భవిష్యత్తుకు, ఒక హెచ్చరిక అంటారు. మౌది మొదటి అయిదేళ్ల పాలన రెండో దఫా పాలన గురించి హెచ్చరింది. ఆ హెచ్చరిక ఏమిటో, మౌది - 1 ప్రభుత్వంలో హిందుత్వ శక్తులు మైనారిటీల మీద, దళితుల మీద ఎటువంటి అరాచకాలకు పాల్పడ్డారో, ప్రజలను కుల, మతాల ఆధారంగా చీల్చి తద్వారా వారి ఆలోచనల్లో మతతత్వ భావజాలాన్ని ఎలా ప్రోదిచేశారో మనకు తెలిపేందుకు ప్రముఖ రచయిత సుభాష్ గాటుడే జరిపిన పంచనామా యే ఈ "మోదినామా." అయన రాసిన ఈ పుస్తకం అసలు పేరు "మౌదినామా : ప్రాముఖ్యత లేని సమస్యలు." ప్రజల జీవనోపాధి, ఆరోగ్యం, విద్య వంటి సమస్యలన్నిటినీ వదిలిపెట్టి మతతత్వ అంశాల చుట్టూ అయిదేళ్లు తిప్పడం ద్వారా సమాజంలో జనసామాన్యం అవి పెద్ద ప్రాధాన్యత లేని విషయాలుగా భావించేట్లు వారిని ప్రభావితం చేశారు.