జనవరి 18, 1983
పాలనా యంత్రాంగంలో స్పీకర్ మకుట స్థానం
(ముఖ్యమంత్రి, ఇతర రాజకీయ పక్ష నాయకులు శ్రీ తంగి సత్యనారాయణను అధ్యక్ష స్థానానికి సగౌరవంగా తీసుకువచ్చి ఆసీనులను గావించారు)
ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి. రామారావు: అధ్యక్షా, సహచరులకు, సోదర సోదరీమణులకు నిన్నటి నుంచి ఏడవ శాసనసభ సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసినదే. తాత్కాలిక సభాపతిగా శ్రీ కాటూరి నారాయణస్వామి గారు అధ్యక్షత వహించి నిన్నటి సమావేశంలో సభ్యుల పదవీ స్వీకార కార్యక్రమాన్ని, నేడు తమ ఎన్నిక కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడం కూడా జరిగింది. శ్రీ నారాయణ స్వామి గారు చాలా హుందాతో, నిండుతనంతో తమ కర్తవ్యాన్ని నిర్వహించి సభా మర్యాదకు, వారు అలంకరించిన పదవికి వన్నె తెచ్చారు. వారు ఎంతో అద్భుతమైన నిపుణతతో, గౌరవ భావంతో ఆ పదవికి వన్నె చేకూర్చినందుకు వారికి సభాపక్షాన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ పక్షాలు, శాసనసభ మనకు గుర్తుకు వస్తాయి.
శాసనసభ అనగానే సభాధ్యక్షులు ఎవరు అని అడుగుతారు అందరూ. మహారాజుకు కిరీటం ఎటువంటిదో శాసనసభకు అధ్యక్షులుగా ఉన్నవారు అటువంటి హుందాతనాన్ని కలిగించే వారు, గౌరవాన్ని కలిగించేవారు, వన్నె చేకూర్చేవారు అనే అవగాహన అందరిలో ఉంది. ప్రజాస్వామ్యంలో.....................
నందమూరి తారక రామారావు అసెంబ్లీ ప్రసంగాలు.
జనవరి 18, 1983 పాలనా యంత్రాంగంలో స్పీకర్ మకుట స్థానం (ముఖ్యమంత్రి, ఇతర రాజకీయ పక్ష నాయకులు శ్రీ తంగి సత్యనారాయణను అధ్యక్ష స్థానానికి సగౌరవంగా తీసుకువచ్చి ఆసీనులను గావించారు) ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి. రామారావు: అధ్యక్షా, సహచరులకు, సోదర సోదరీమణులకు నిన్నటి నుంచి ఏడవ శాసనసభ సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసినదే. తాత్కాలిక సభాపతిగా శ్రీ కాటూరి నారాయణస్వామి గారు అధ్యక్షత వహించి నిన్నటి సమావేశంలో సభ్యుల పదవీ స్వీకార కార్యక్రమాన్ని, నేడు తమ ఎన్నిక కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడం కూడా జరిగింది. శ్రీ నారాయణ స్వామి గారు చాలా హుందాతో, నిండుతనంతో తమ కర్తవ్యాన్ని నిర్వహించి సభా మర్యాదకు, వారు అలంకరించిన పదవికి వన్నె తెచ్చారు. వారు ఎంతో అద్భుతమైన నిపుణతతో, గౌరవ భావంతో ఆ పదవికి వన్నె చేకూర్చినందుకు వారికి సభాపక్షాన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ పక్షాలు, శాసనసభ మనకు గుర్తుకు వస్తాయి. శాసనసభ అనగానే సభాధ్యక్షులు ఎవరు అని అడుగుతారు అందరూ. మహారాజుకు కిరీటం ఎటువంటిదో శాసనసభకు అధ్యక్షులుగా ఉన్నవారు అటువంటి హుందాతనాన్ని కలిగించే వారు, గౌరవాన్ని కలిగించేవారు, వన్నె చేకూర్చేవారు అనే అవగాహన అందరిలో ఉంది. ప్రజాస్వామ్యంలో..................... నందమూరి తారక రామారావు అసెంబ్లీ ప్రసంగాలు.© 2017,www.logili.com All Rights Reserved.