ఈ గ్రంథంలో ఇప్పటికే మనకు తెలిసిన కొందరి, అసలే తెలియని మరి కొందరి ప్రపంచ రచయితల కళాకారుల జీవితాలు వారి సాహిత్యాలు పరిచయమౌతాయి. రచయితలను పరిచయం చేయడంలో పార్థసారధి నిర్దిష్టమైన మెథడాలోజిని అనుసరించారు. ఏ సామజిక పరిస్థితులలోంచి వాళ్ళు రచయితలుగా పుట్టుకొచ్చారో ఎలాంటి పరిస్థితులలోంచి వాళ్ళు గొప్ప రచయితలుగా ఎదిగారో పార్థసారధి వివరించారు. మనలోలాగే ప్రపంచ రచయితలందరిలోను ఆస్తికులు, నాస్తికులు ఉన్నారు. సంపన్న వర్గవాళ్ళు సామాన్య వర్గీయులు ఉన్నారు. అల్లరి చిల్లరగా తిరిగి రచనా రంగంలో ప్రవేశించి ఉత్తమ రచయితలుగా ఎదిగిన వాళ్ళున్నారు. గ్రీకు సాహిత్యంతో మొదలుబెట్టి ప్రపంచ సాహిత్యాన్ని మనకు పరిచయం చేసిన పార్థసారథికి ధన్యవాదాలు.
- ముక్తవరం పార్థసారధి