అమెరికన్ పత్రికా రచయిత ఆర్బర్ట్ రీస్ విలియమ్స్ 1917 మధ్యలో రష్యా వచ్చి, పాత పరిపాలనా వ్యవస్థ పతనాన్నీ, అక్టోబరు సోషలిస్టు మహావిప్లవ విజయాన్నీ, ఆ కల్లోలిత మాసాలలో విప్లవ ప్రజారాసుల ప్రదర్శనలనూ, వింటర్ ప్యాలెస్ పై దాడినీ, దేశం పొడుగునా సోవియట్ అధికార విజయ యాత్రనూ అతను చూశాడు. 'రష్యాలో విప్లవం' అనే పుస్తకం వీటిని గురించి వివరిస్తుంది.
విలియమ్స్ లెనిన్ ని అనేక సందర్భాల్లో కలుసుకున్నాడు. లెనిన్ మాట్లాడిన సమావేశంలోనే ఇతడూ మాట్లాడాడు. విప్లవ నాయకుడైన లెనిన్ తన దైనిక కార్యకలాపంలో నిమగ్నుడై ఉండగా రీస్ విలియమ్స్ ప్రత్యక్షంగా చూసి ఈ కథనాన్ని మనకందించాడు. 'లెనిన్: వ్యక్తీ, అతని కృషీ' అనే పుస్తకంలో లెనిన్ గురించి అమితోత్సాహంతో విలియమ్స్ రాశాడు. అతడు 1931 లో మళ్ళీ సోవియట్ యూనియన్ సందర్శించి, లెనిన్ గురించి ప్రస్తావిస్తూ 'ప్రపంచంలోకెల్లా గొప్పదైన పూర్వమందిరం' అనే వ్యాసాన్ని ప్రచురించాడు. ఆల్బర్ట్ రీస్ విలియమ్స్ వెలువరించిన రచనలన్నీ ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. 1959 లో అతడు సోవియట్ యూనియన్ తిరిగి వచ్చినప్పుడు తన పుస్తకంలో రష్యన్ కూర్పుకు రచించిన ఉపోద్ఘాతం కూడా ఈ పుస్తకంలో చేర్చబడింది.
అమెరికన్ పత్రికా రచయిత ఆర్బర్ట్ రీస్ విలియమ్స్ 1917 మధ్యలో రష్యా వచ్చి, పాత పరిపాలనా వ్యవస్థ పతనాన్నీ, అక్టోబరు సోషలిస్టు మహావిప్లవ విజయాన్నీ, ఆ కల్లోలిత మాసాలలో విప్లవ ప్రజారాసుల ప్రదర్శనలనూ, వింటర్ ప్యాలెస్ పై దాడినీ, దేశం పొడుగునా సోవియట్ అధికార విజయ యాత్రనూ అతను చూశాడు. 'రష్యాలో విప్లవం' అనే పుస్తకం వీటిని గురించి వివరిస్తుంది. విలియమ్స్ లెనిన్ ని అనేక సందర్భాల్లో కలుసుకున్నాడు. లెనిన్ మాట్లాడిన సమావేశంలోనే ఇతడూ మాట్లాడాడు. విప్లవ నాయకుడైన లెనిన్ తన దైనిక కార్యకలాపంలో నిమగ్నుడై ఉండగా రీస్ విలియమ్స్ ప్రత్యక్షంగా చూసి ఈ కథనాన్ని మనకందించాడు. 'లెనిన్: వ్యక్తీ, అతని కృషీ' అనే పుస్తకంలో లెనిన్ గురించి అమితోత్సాహంతో విలియమ్స్ రాశాడు. అతడు 1931 లో మళ్ళీ సోవియట్ యూనియన్ సందర్శించి, లెనిన్ గురించి ప్రస్తావిస్తూ 'ప్రపంచంలోకెల్లా గొప్పదైన పూర్వమందిరం' అనే వ్యాసాన్ని ప్రచురించాడు. ఆల్బర్ట్ రీస్ విలియమ్స్ వెలువరించిన రచనలన్నీ ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. 1959 లో అతడు సోవియట్ యూనియన్ తిరిగి వచ్చినప్పుడు తన పుస్తకంలో రష్యన్ కూర్పుకు రచించిన ఉపోద్ఘాతం కూడా ఈ పుస్తకంలో చేర్చబడింది.© 2017,www.logili.com All Rights Reserved.