ఆ౦ధ్రులు సదా స్పరించుకొనదగిన మహామూర్తి శ్రీకృష్ణదేవరాయలు. పదహారవ శతాబ్దపు తెలుగు వచనంలో, కృష్ణరాయల విశిష్ట వ్యక్తిత్వం గురించి తెలిపే అద్భుత చారిత్రక రచన రాయవాచకము. భాషాభిమానులకు, చరిత్ర అభిమానులకు అవశ్యపఠనీయ గ్రంథం రాయవాచకము.
రాయవాచక కర్త కృష్ణరాయలను ఎరుగడు. ఆయనకు అత్యంత సమీప కాలం వాడు కూడా కాదు. కటకం గజపతుల వృత్తాంతం, కృష్ణరాయల తదనంతర వ్యక్తులు కథనంలో చోటుచేసుకోవడం, ప్రతాపరుద్రుని వృత్తాంతం వంటివి అందుకు సాక్ష్యాలు. కానీ ఈ రాయవాచకం చెబుతున్నది కృష్ణరాయలు గురించి. "ఓడు ఓడు అంటే కంచమంతా ఓడు" అనే సామెతగా కొన్ని అంశాలు చరిత్రకు నప్పకపోయినంత మాత్రాన రాయవాచకం మొత్తం పొల్లు కాదు కదా. కృష్ణరాయలు గురించి, ఆయన నడవడిక గురించి ఈ గ్రంథం చెబుతున్నది.
ఆ౦ధ్రులు సదా స్పరించుకొనదగిన మహామూర్తి శ్రీకృష్ణదేవరాయలు. పదహారవ శతాబ్దపు తెలుగు వచనంలో, కృష్ణరాయల విశిష్ట వ్యక్తిత్వం గురించి తెలిపే అద్భుత చారిత్రక రచన రాయవాచకము. భాషాభిమానులకు, చరిత్ర అభిమానులకు అవశ్యపఠనీయ గ్రంథం రాయవాచకము. రాయవాచక కర్త కృష్ణరాయలను ఎరుగడు. ఆయనకు అత్యంత సమీప కాలం వాడు కూడా కాదు. కటకం గజపతుల వృత్తాంతం, కృష్ణరాయల తదనంతర వ్యక్తులు కథనంలో చోటుచేసుకోవడం, ప్రతాపరుద్రుని వృత్తాంతం వంటివి అందుకు సాక్ష్యాలు. కానీ ఈ రాయవాచకం చెబుతున్నది కృష్ణరాయలు గురించి. "ఓడు ఓడు అంటే కంచమంతా ఓడు" అనే సామెతగా కొన్ని అంశాలు చరిత్రకు నప్పకపోయినంత మాత్రాన రాయవాచకం మొత్తం పొల్లు కాదు కదా. కృష్ణరాయలు గురించి, ఆయన నడవడిక గురించి ఈ గ్రంథం చెబుతున్నది.© 2017,www.logili.com All Rights Reserved.