ఏనుగు ముందు ముందుకు వెళ్ళిపోతున్నది. ఏనుగు ఖాళీ చేసిన స్థలం,
దాని వెనుక వదలి పెట్టబడుతున్నది.
ఈ రోజు ఉదయం. తూర్పున సూర్యోదయం అయింది. అదే దిశ, దానితో మార్పులేదు. సూర్యుడు అపరదిశనుంచి వస్తాడని ఎవరూ అనుకోలేదు. అతని రాకపై అందరికీ నమ్మకం ఉంది. ఏదో ఓ దినం సూర్యుడు ముబ్బుల్లో దాగి ఉన్నప్పటికీ ఉదయించడం మాత్రం ఆగదు. సూర్యుని ఉదయాస్తమయాలు నిత్యసత్యాలు. సూర్యోదయం అయిందనడానికి నిదర్శనం పగలు, అస్తమయానికి నిదర్శనంగా రాత్రి అవుతాయి. ఇప్పటికీ చీకటి ఉంది. రాత్రి చీకటిలో అన్నీ నల్లగా కనిపించుతవి. పగలు పారదర్శకం. అప్పుడు ఏది ఏరంగులో ఉందో ఆరంగులో కనబడుతుంది. రఘువర ప్రసాద్ రంగు నలుపు. బాల్యంలో అతడు నిద్రలేవగానే రాత్రి చీకటి అతని శరీరాన్ని అంటుకొని ఉండిపోయిందని అతనికి అనిపించేది. కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని స్నానం చేస్తే తాను కొంత శుభ్రంగా తేజోవంతంగా అవుతానని అనుకునే వాడు. మధ్య మధ్య కొన్ని దినాలు ఉదయం లేవగానే అలా అనిపించేది కాదు. అవి వెన్నెల రాత్రులు అయి ఉండవు. నెల అంతా వెన్నెల రాత్రులుండవు, సంవత్సరం పొడుగునా పున్నమి రాత్రులే ఉన్నట్లయితే అతని రంగు అంత నల్లగా ఉండేది కాదు. అయినా అతని మీసాలు, అతని శరీర వర్ణంలో కలిసిపోయి స్పష్టంగా కన్పించనంతటి నలుపురంగేం కాదు. రఘువరప్రసాద్ది ఇరువది రెండు ఇరువది మూడేండ్ల వయస్సు, పెద్ద పెద్ద కన్నులున్న కారణంగా అతడు అందంగానే కన్పించే వాడు. ఈ దినం ఈనాటి ఊరపిచ్చుకల కిచకిచలు వినిపించుతున్నవి. కిటికీ నుంచి కనిపించే చెట్లు ఈ దినపు చెట్లవలెనే కనిపించుతున్నవి. అవి నూమిడి చెట్లు. మామిడి చెట్లనడుమ ఉన్న పాత వేప చెట్టు ఇవ్వాలిటి చెట్టే. మామిడి చెట్ల ఆకులు ఈరోజు పచ్చగా ఉన్నవి. అలాగే అన్ని చెట్లవీ ఉన్నవి. మామిడి చెట్టుకు పూతవచ్చింది. చెట్లు పూతతోనిండి ఉన్నవి. మావి పూల సుగంధపుగాలిని పీలిస్తే మత్తు వచ్చేస్తుంది. చెట్లు పూయవలసినదంతా పూసినట్లున్నవి...............
ఏనుగు ముందు ముందుకు వెళ్ళిపోతున్నది. ఏనుగు ఖాళీ చేసిన స్థలం, దాని వెనుక వదలి పెట్టబడుతున్నది. ఈ రోజు ఉదయం. తూర్పున సూర్యోదయం అయింది. అదే దిశ, దానితో మార్పులేదు. సూర్యుడు అపరదిశనుంచి వస్తాడని ఎవరూ అనుకోలేదు. అతని రాకపై అందరికీ నమ్మకం ఉంది. ఏదో ఓ దినం సూర్యుడు ముబ్బుల్లో దాగి ఉన్నప్పటికీ ఉదయించడం మాత్రం ఆగదు. సూర్యుని ఉదయాస్తమయాలు నిత్యసత్యాలు. సూర్యోదయం అయిందనడానికి నిదర్శనం పగలు, అస్తమయానికి నిదర్శనంగా రాత్రి అవుతాయి. ఇప్పటికీ చీకటి ఉంది. రాత్రి చీకటిలో అన్నీ నల్లగా కనిపించుతవి. పగలు పారదర్శకం. అప్పుడు ఏది ఏరంగులో ఉందో ఆరంగులో కనబడుతుంది. రఘువర ప్రసాద్ రంగు నలుపు. బాల్యంలో అతడు నిద్రలేవగానే రాత్రి చీకటి అతని శరీరాన్ని అంటుకొని ఉండిపోయిందని అతనికి అనిపించేది. కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని స్నానం చేస్తే తాను కొంత శుభ్రంగా తేజోవంతంగా అవుతానని అనుకునే వాడు. మధ్య మధ్య కొన్ని దినాలు ఉదయం లేవగానే అలా అనిపించేది కాదు. అవి వెన్నెల రాత్రులు అయి ఉండవు. నెల అంతా వెన్నెల రాత్రులుండవు, సంవత్సరం పొడుగునా పున్నమి రాత్రులే ఉన్నట్లయితే అతని రంగు అంత నల్లగా ఉండేది కాదు. అయినా అతని మీసాలు, అతని శరీర వర్ణంలో కలిసిపోయి స్పష్టంగా కన్పించనంతటి నలుపురంగేం కాదు. రఘువరప్రసాద్ది ఇరువది రెండు ఇరువది మూడేండ్ల వయస్సు, పెద్ద పెద్ద కన్నులున్న కారణంగా అతడు అందంగానే కన్పించే వాడు. ఈ దినం ఈనాటి ఊరపిచ్చుకల కిచకిచలు వినిపించుతున్నవి. కిటికీ నుంచి కనిపించే చెట్లు ఈ దినపు చెట్లవలెనే కనిపించుతున్నవి. అవి నూమిడి చెట్లు. మామిడి చెట్లనడుమ ఉన్న పాత వేప చెట్టు ఇవ్వాలిటి చెట్టే. మామిడి చెట్ల ఆకులు ఈరోజు పచ్చగా ఉన్నవి. అలాగే అన్ని చెట్లవీ ఉన్నవి. మామిడి చెట్టుకు పూతవచ్చింది. చెట్లు పూతతోనిండి ఉన్నవి. మావి పూల సుగంధపుగాలిని పీలిస్తే మత్తు వచ్చేస్తుంది. చెట్లు పూయవలసినదంతా పూసినట్లున్నవి...............© 2017,www.logili.com All Rights Reserved.