కుంజీ
చెట్టు నాదే" అంటూ పరిగెత్తింది కమల. సౌడు నేల. మసకవేళ, వెన్నెల కాస్తున్నా మబ్బు అడ్డం వచ్చి మసక మసకగానే కనబడుతున్నది. కమల వెనుక "పువ్వు "అందరిది" అంటూ విజయ, రాధ పరిగెత్తారు. కమల పువ్వు తెంపటానికి చేయి చాచి కొమ్మ పంచబోయింది. అంతే ముల్లు గీరుకున్నది. ముల్లు గీరితే గాని అది రేణి చెట్టని తెలియలేదు. మసక చీకట్లో చెట్టు కనిపిస్తున్నది గాని ఏ చెట్టో తెలియటంలేదు. పైగా రేణిచెట్టు ఎత్తు పెరిగింది. సౌడుమట్టి తరచుగా కొమ్మల మీద పడి పూలవలె భ్రమపెడుతున్నది. కమల ఆ చీకట్లో కనబడీ కనబడక తంగెడు చెట్టని భ్రమించింది. బతుకమ్మ పండుగదినాలు. తంగెడు పువ్వు కోసం చీకటి తేలిపోకముందే అందరూ కంచెలమీద పడుతారు. చలికాలం మొదలవటం వల్ల గడ్డి, అలం మీద మంచులో తడిసి ఇగంతో స్పర్శ తప్పుతున్నది. మెడకూ, తలకూ అరికంట్లం కట్టుకున్నా చలి తాకుతున్నది. పెద్ద బతుకమ్మ పేర్చటానికి తంగెడు పువ్వు ఎంత దొరికినా తక్కువే. ఎంత తెంపుకొస్తే అంత గొప్ప. పండుగొచ్చిందంటే చాలు పడుచువాళ్లంతా.. పోటీ పడతారు. పువ్వుకోసం వేట, కమల అయిదుగురు దోస్తులతో వచ్చింది. తెల్లారితే | పువ్వు దొరకదని మసక చీకటయినా ఆరాటం.
"మబ్బు మోసం చేసిందే" కమల మాటలకు రాధ అడ్డమొచ్చింది. "మబ్బు మోసం చేస్తదా? మనుసులే మోసం జేస్తరు", "మబ్బో, వెన్నెలో, మనుసులో, చెట్లో ఎవరైతేంది మోసం చేసెతందుకు" వాళ్లతోనే వచ్చినా చడీచప్పుడు గాకుండా సరస్వతి అనసూర్యలు గుట్టుగా వెళ్ళి పువ్వు తెంపి తట్టలో నింపుతున్నారు.........................
కుంజీ చెట్టు నాదే" అంటూ పరిగెత్తింది కమల. సౌడు నేల. మసకవేళ, వెన్నెల కాస్తున్నా మబ్బు అడ్డం వచ్చి మసక మసకగానే కనబడుతున్నది. కమల వెనుక "పువ్వు "అందరిది" అంటూ విజయ, రాధ పరిగెత్తారు. కమల పువ్వు తెంపటానికి చేయి చాచి కొమ్మ పంచబోయింది. అంతే ముల్లు గీరుకున్నది. ముల్లు గీరితే గాని అది రేణి చెట్టని తెలియలేదు. మసక చీకట్లో చెట్టు కనిపిస్తున్నది గాని ఏ చెట్టో తెలియటంలేదు. పైగా రేణిచెట్టు ఎత్తు పెరిగింది. సౌడుమట్టి తరచుగా కొమ్మల మీద పడి పూలవలె భ్రమపెడుతున్నది. కమల ఆ చీకట్లో కనబడీ కనబడక తంగెడు చెట్టని భ్రమించింది. బతుకమ్మ పండుగదినాలు. తంగెడు పువ్వు కోసం చీకటి తేలిపోకముందే అందరూ కంచెలమీద పడుతారు. చలికాలం మొదలవటం వల్ల గడ్డి, అలం మీద మంచులో తడిసి ఇగంతో స్పర్శ తప్పుతున్నది. మెడకూ, తలకూ అరికంట్లం కట్టుకున్నా చలి తాకుతున్నది. పెద్ద బతుకమ్మ పేర్చటానికి తంగెడు పువ్వు ఎంత దొరికినా తక్కువే. ఎంత తెంపుకొస్తే అంత గొప్ప. పండుగొచ్చిందంటే చాలు పడుచువాళ్లంతా.. పోటీ పడతారు. పువ్వుకోసం వేట, కమల అయిదుగురు దోస్తులతో వచ్చింది. తెల్లారితే | పువ్వు దొరకదని మసక చీకటయినా ఆరాటం. "మబ్బు మోసం చేసిందే" కమల మాటలకు రాధ అడ్డమొచ్చింది. "మబ్బు మోసం చేస్తదా? మనుసులే మోసం జేస్తరు", "మబ్బో, వెన్నెలో, మనుసులో, చెట్లో ఎవరైతేంది మోసం చేసెతందుకు" వాళ్లతోనే వచ్చినా చడీచప్పుడు గాకుండా సరస్వతి అనసూర్యలు గుట్టుగా వెళ్ళి పువ్వు తెంపి తట్టలో నింపుతున్నారు.........................© 2017,www.logili.com All Rights Reserved.