1. సమగ్ర చీడపీడల యాజమాన్యం వైపుగా...
ఈ పుస్తకం లక్ష్యం ఏమంటే మనం రసాయన పురుగుమందుల అనవసర వినియోగం నుంచి విముక్తం కావడమే. 'సమగ్ర సస్యరక్షణ' అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న ఉత్తమమైన పధ్ధతి. పంట అంచనాను, పురుగు స్థాయినీ, నియంత్రణావసరాలు, మార్గాలు, పురుగుల సహజ జీవితచక్రం అన్నింటినీ బేరీజు వేసుకుని పురుగు జనాభాను పంటకు నష్టం కలిగించని స్థాయిలో ఉంచుతుంది. కీటకాలపై మన యుద్ధం విజయవంతం కావాలంటే ఈ శాస్త్రీయమైన విధానమే శరణ్యం. ప్రస్తుత రసాయన నియంత్రణ నుంచి ఉత్తమమైన ఈ విధానం వైపు మన రైతాంగం కదలాలి. అదే ఈ చిన్న పుస్తకంలో చర్చించడం జరిగింది.
- డాక్టర్ ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం
2. నా పొలంలో ఏ పంటయినా పండదెందుకని?
ఒక గ్రామంలోని రైతులు, తమ ఉమ్మడి, ఆలోచన, పరస్పరం పంచుకున్న విజ్ఞానం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి. అలా కాకుండా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. ఈ చిన్న పుస్తకంలో మంచి వ్యవసాయ భూములు భీడు భూములుగా ఎలా మారిపోతున్నాయో వివరించడం జరిగింది. గతంలో మాదిరిగా సమిష్టి వ్యవసాయ దిశగా మన రైతాంగం ఆలోచన కదలాలి. ప్రస్తుత వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించేందుకు ఇదే శరణ్యం.
- డాక్టర్ ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం
3. క్రిమిసంహారకాలు - కాలకూట విషాలు
క్రిమిసంహారకాల వల్ల తమ ఆరోగ్యం ఎలా పాడవుతుందో చాలా మంది రైతులకు తెలియదు. వారు దాన్ని అనుభవ పూర్వకంగా మాత్రమే తెలుసుకొంటున్నారు. అందుకే పురుగుమందులు వాడేటప్పుడు తన ఆరోగ్యానికి, ఇతరుల ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎలాంటి ముప్పు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో ఈ పుస్తకం వివరిస్తుంది.
- డాక్టర్ కోయ వెంకటేశ్వర రావు
4. పురుగు మందులు వాడే సరైన పద్ధతులు
పురుగుమందులు ఏ విధంగా పనిచేస్తాయో ఎప్పుడైనా గమనించారా? ఒక రకమైన క్రిములకు ఒక ప్రత్యేకమైన క్రిమి సంహారిణి మాత్రమే ఎందుకు పనిచేస్తుందో ఆలోచించారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోగలిగితే, దుకాణాదారుల మోసాల నుండి బయటపడవచ్చు. వారి నుంచి పనికిరాని పురుగుమందులు కొనకుండా సరియైన క్రిమి సంహారిణిని ఎంచుకోడం మీకు సాధ్యపడుతుంది.
- ప్రొఫెసర్ ముండ్రా ఆదినారాయణ
ఇందులో నాలుగు పుస్తకాలు ఉన్నాయి.
1. సమగ్ర చీడపీడల యాజమాన్యం వైపుగా... ఈ పుస్తకం లక్ష్యం ఏమంటే మనం రసాయన పురుగుమందుల అనవసర వినియోగం నుంచి విముక్తం కావడమే. 'సమగ్ర సస్యరక్షణ' అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న ఉత్తమమైన పధ్ధతి. పంట అంచనాను, పురుగు స్థాయినీ, నియంత్రణావసరాలు, మార్గాలు, పురుగుల సహజ జీవితచక్రం అన్నింటినీ బేరీజు వేసుకుని పురుగు జనాభాను పంటకు నష్టం కలిగించని స్థాయిలో ఉంచుతుంది. కీటకాలపై మన యుద్ధం విజయవంతం కావాలంటే ఈ శాస్త్రీయమైన విధానమే శరణ్యం. ప్రస్తుత రసాయన నియంత్రణ నుంచి ఉత్తమమైన ఈ విధానం వైపు మన రైతాంగం కదలాలి. అదే ఈ చిన్న పుస్తకంలో చర్చించడం జరిగింది. - డాక్టర్ ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం 2. నా పొలంలో ఏ పంటయినా పండదెందుకని? ఒక గ్రామంలోని రైతులు, తమ ఉమ్మడి, ఆలోచన, పరస్పరం పంచుకున్న విజ్ఞానం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి. అలా కాకుండా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. ఈ చిన్న పుస్తకంలో మంచి వ్యవసాయ భూములు భీడు భూములుగా ఎలా మారిపోతున్నాయో వివరించడం జరిగింది. గతంలో మాదిరిగా సమిష్టి వ్యవసాయ దిశగా మన రైతాంగం ఆలోచన కదలాలి. ప్రస్తుత వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించేందుకు ఇదే శరణ్యం. - డాక్టర్ ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం 3. క్రిమిసంహారకాలు - కాలకూట విషాలు క్రిమిసంహారకాల వల్ల తమ ఆరోగ్యం ఎలా పాడవుతుందో చాలా మంది రైతులకు తెలియదు. వారు దాన్ని అనుభవ పూర్వకంగా మాత్రమే తెలుసుకొంటున్నారు. అందుకే పురుగుమందులు వాడేటప్పుడు తన ఆరోగ్యానికి, ఇతరుల ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎలాంటి ముప్పు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో ఈ పుస్తకం వివరిస్తుంది. - డాక్టర్ కోయ వెంకటేశ్వర రావు 4. పురుగు మందులు వాడే సరైన పద్ధతులు పురుగుమందులు ఏ విధంగా పనిచేస్తాయో ఎప్పుడైనా గమనించారా? ఒక రకమైన క్రిములకు ఒక ప్రత్యేకమైన క్రిమి సంహారిణి మాత్రమే ఎందుకు పనిచేస్తుందో ఆలోచించారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోగలిగితే, దుకాణాదారుల మోసాల నుండి బయటపడవచ్చు. వారి నుంచి పనికిరాని పురుగుమందులు కొనకుండా సరియైన క్రిమి సంహారిణిని ఎంచుకోడం మీకు సాధ్యపడుతుంది. - ప్రొఫెసర్ ముండ్రా ఆదినారాయణ ఇందులో నాలుగు పుస్తకాలు ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.