మాయావి మహిమ
దేశంలో ప్రాచీన పుణ్య క్షేత్రాలు, పురాతన దేవాలయాలు ఎన్నో. ఉన్నాయి. ఎప్పుడూ భక్తుల రద్దీతో కిటకిటలాడేవి, బహు సంపన్నమైనవి, మహిమాన్వితమైనవి వాటిలో చాలా ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు. తిరుమల దివ్యధామం ఇంకో ఎత్తు.
మధుర, శ్రీరంగం, చిదంబరం, తంజావూరు, రామేశ్వరం, అరుణాచలాల వలె బహు విశాలం కాదు. అద్భుత నిర్మాణం కాదు. అక్కడ ఉన్నది కచ్చితంగా ఫలానా దేవుడే అని ఎవరూ చెప్పలేరు. ఈ దైవం అనుకోగానే ఇంకో దైవం లక్షణాలు, వేరేదో దైవం ఛాయలు కనిపించి పరిశీలన ఎక్కువైనవారిని కన్ఫ్యూజ్ చేస్తాయి. విసిరేసినట్టు కొండ మీద గుడి. వసతులు తక్కువ. ఒకప్పుడు అదంతా కీకారణ్యం. ఘాట్ రోడ్డు మెట్ల దారీ లేని కాలంలో మనుషులు మోసే డోలీల మీద క్రూర మృగాల మధ్య నుంచి ప్రయాణం. ఇవాళ సౌకర్యాలు పెరిగినా సామాన్యుడికి దర్శనం కష్టం. కొన్ని సెకండ్ల భాగ్యానికి చాలా గంటల, పూటలు వెయిటింగ్! ప్రతిదీ ఖరీదు. డబ్బు. డబ్బు. అడుగడుగునా చికాకు, అవస్థ. జన్మలో మళ్ళీ రావద్దు బాబోయ్ అనిపించేంత యాతన.
అయినా ఎన్నో శతాబ్దాలుగా దేశమంతటినుంచీ వచ్చిన వారు ప్రవాహంలా వస్తూనే ఉన్నారు.. మళ్ళీ మళ్ళీ మళ్ళీ. దర్శనార్థుల సంఖ్య ఏ నాడూ అరలక్ష తగ్గదు. లక్ష మంది రావటం మామూలు విషయం. దర్శనానికి 24 గంటలు పట్టే రోజులూ ఉంటాయి. అయినా ఎవరూ................
మాయావి మహిమ దేశంలో ప్రాచీన పుణ్య క్షేత్రాలు, పురాతన దేవాలయాలు ఎన్నో. ఉన్నాయి. ఎప్పుడూ భక్తుల రద్దీతో కిటకిటలాడేవి, బహు సంపన్నమైనవి, మహిమాన్వితమైనవి వాటిలో చాలా ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు. తిరుమల దివ్యధామం ఇంకో ఎత్తు. మధుర, శ్రీరంగం, చిదంబరం, తంజావూరు, రామేశ్వరం, అరుణాచలాల వలె బహు విశాలం కాదు. అద్భుత నిర్మాణం కాదు. అక్కడ ఉన్నది కచ్చితంగా ఫలానా దేవుడే అని ఎవరూ చెప్పలేరు. ఈ దైవం అనుకోగానే ఇంకో దైవం లక్షణాలు, వేరేదో దైవం ఛాయలు కనిపించి పరిశీలన ఎక్కువైనవారిని కన్ఫ్యూజ్ చేస్తాయి. విసిరేసినట్టు కొండ మీద గుడి. వసతులు తక్కువ. ఒకప్పుడు అదంతా కీకారణ్యం. ఘాట్ రోడ్డు మెట్ల దారీ లేని కాలంలో మనుషులు మోసే డోలీల మీద క్రూర మృగాల మధ్య నుంచి ప్రయాణం. ఇవాళ సౌకర్యాలు పెరిగినా సామాన్యుడికి దర్శనం కష్టం. కొన్ని సెకండ్ల భాగ్యానికి చాలా గంటల, పూటలు వెయిటింగ్! ప్రతిదీ ఖరీదు. డబ్బు. డబ్బు. అడుగడుగునా చికాకు, అవస్థ. జన్మలో మళ్ళీ రావద్దు బాబోయ్ అనిపించేంత యాతన. అయినా ఎన్నో శతాబ్దాలుగా దేశమంతటినుంచీ వచ్చిన వారు ప్రవాహంలా వస్తూనే ఉన్నారు.. మళ్ళీ మళ్ళీ మళ్ళీ. దర్శనార్థుల సంఖ్య ఏ నాడూ అరలక్ష తగ్గదు. లక్ష మంది రావటం మామూలు విషయం. దర్శనానికి 24 గంటలు పట్టే రోజులూ ఉంటాయి. అయినా ఎవరూ................© 2017,www.logili.com All Rights Reserved.