సంసారసరిగమలు తేనెతెరలు
విప్లవాల పురిటిగడ్డ నల్లగొండ. ఎన్నో ఉద్యమాలకు పుట్టిల్లు. తెలంగాణా సాయుధపోరాటానికి అంకురార్పణ జరిగింది ఇక్కడే. ఆంధ్రమహాసభ, గ్రంథాలయ ఉద్యమాల ద్వారా సాహితీచైతన్యం వెల్లివిరిసింది. పై ఉద్యమాల ద్వారా ఎంతోమంది రచయితలు మనముందుకొచ్చారు. నాటి తొలి కథకురాలు బండారు అచ్చమాంబ మన జిల్లా వాసి కావడం మనకు గర్వకారణం. ఆమె మొదటి కథ 'స్త్రీవిద్య' 1902లో 'హిందూసుందరి' పత్రికలో వచ్చింది. 2010లో గురజాడ 'దిద్దుబాటు' తెలుగులో మొదటి కథ అని చెప్పుకునే కథ కంటే ఎనిమిదేండ్ల ముందుగానే బండారు అచ్చమాంబ కథ రాశారు.
నిజాం వ్యతిరేకసాయుధపోరాటంలో ఎంతోమంది మన జిల్లా రచయితలు ఉద్యమస్ఫూర్తితో కథలు రాశారు. కాంచనపల్లి చినవెంకటరామారావు 'మావూళ్ళో కూడానా'; వట్టికోట ఆళ్వారుస్వామి 'జైలులోపల'; ఆవుల పిచ్చయ్య 'ఊరేగింపులు' కథలు రాశారు. ఆ తరువాత అంబడిపూడి చండూరులో ఏర్పాటు చేసిన 'సాహితీమేఖల' ద్వారా అంబడిపూడి, ధవళా శ్రీనివాసరావు కథలు రాశారు. 'ఉషస్సు' కథాసంకలనం వచ్చింది.....................
సంసారసరిగమలు తేనెతెరలు విప్లవాల పురిటిగడ్డ నల్లగొండ. ఎన్నో ఉద్యమాలకు పుట్టిల్లు. తెలంగాణా సాయుధపోరాటానికి అంకురార్పణ జరిగింది ఇక్కడే. ఆంధ్రమహాసభ, గ్రంథాలయ ఉద్యమాల ద్వారా సాహితీచైతన్యం వెల్లివిరిసింది. పై ఉద్యమాల ద్వారా ఎంతోమంది రచయితలు మనముందుకొచ్చారు. నాటి తొలి కథకురాలు బండారు అచ్చమాంబ మన జిల్లా వాసి కావడం మనకు గర్వకారణం. ఆమె మొదటి కథ 'స్త్రీవిద్య' 1902లో 'హిందూసుందరి' పత్రికలో వచ్చింది. 2010లో గురజాడ 'దిద్దుబాటు' తెలుగులో మొదటి కథ అని చెప్పుకునే కథ కంటే ఎనిమిదేండ్ల ముందుగానే బండారు అచ్చమాంబ కథ రాశారు. నిజాం వ్యతిరేకసాయుధపోరాటంలో ఎంతోమంది మన జిల్లా రచయితలు ఉద్యమస్ఫూర్తితో కథలు రాశారు. కాంచనపల్లి చినవెంకటరామారావు 'మావూళ్ళో కూడానా'; వట్టికోట ఆళ్వారుస్వామి 'జైలులోపల'; ఆవుల పిచ్చయ్య 'ఊరేగింపులు' కథలు రాశారు. ఆ తరువాత అంబడిపూడి చండూరులో ఏర్పాటు చేసిన 'సాహితీమేఖల' ద్వారా అంబడిపూడి, ధవళా శ్రీనివాసరావు కథలు రాశారు. 'ఉషస్సు' కథాసంకలనం వచ్చింది.....................© 2017,www.logili.com All Rights Reserved.