వెల్కమ్ టు థ్రిల్లింగ్ - చిల్లింగ్ స్టోరీ...
వందేళ్ల తెలుగు కథా సాహిత్య చరిత్రలో భయానక కథల తొలి సంపుటి 'ఆ అరగంట చాలు' ప్రచురణ తరువాత పాఠకుల ప్రతిస్పందన ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఉత్తమస్థాయి కథలను పాఠకులు తప్పనిసరిగా ఆదరిస్తారన్న నా విశ్వాసం మరింత బలపడింది. అయితే, హారర్ కథలు తెలుగులో లేని సమయంలో ఓ పది పదిహేను కథలు రాసేసి సంతృప్తిపడటం కష్టం. ప్రపంచ సాహిత్యంలో హారర్ కథలు ఓ మహావృక్షంలా ఎదిగాయి. దాదాపుగా 50 పైన విభిన్నమైన రకాల హారర్ కథలు ఉన్నాయి. వీటిలో ఒకోరకం ఒకో వృక్షంలా ఎదిగింది. ఉదాహరణకు, 'సైన్స్ ఫిక్షన్ హారర్' అన్నది హారర్ కథలలో ఒక రకమైతే, సైన్స్ఫక్షన్ హారర్ పదిహేను విభిన్నమైన రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకో రకంలో దాదాపుగా యాభై పైగా భిన్నమైన సైన్స్ ఫిక్షన్ హారర్ కథలున్నాయి. అంటే, తెలుగు సాహిత్యంలో పెద్దలు, విమర్శకులు రాయకూడనివిగా పరిగణించి, చిన్నచూపు చూసి, పట్టించుకోని హారర్ కథ ప్రపంచ సాహిత్యంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని, అస్తిత్వాన్ని కలిగి ఉందన్నమాట. హారర్ సాహిత్య విశ్లేషణ సాహిత్య విమర్శ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును కలిగి ఉంది. అలాంటప్పుడు తెలుగు పాఠకులకు ఓ పదిహేను కథలను పరిచయం చేసేసి సంతృప్తిపడటం కుదరని పని. అందుకని, హారర్ ప్రపంచంలోని విభిన్న శాఖలకు ప్రాతినిధ్యం వహించే విభిన్నమైన కథలను సృజించి వారం వారం పాఠకులకు ఉర్రూతలూగించే థ్రిల్లింగ్/చిల్లింగ్ కథలను అందిస్తానని ప్రతిపాదన చేసినపుడు 'వార్త' సంపాదకులు సాయిబాబాగారు, ఆదివారం ఇన్చార్జి శ్యామలగారు వెంటనే ఆమోదించారు. కథా రచనలో సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చారు. ఫలితంగా 'థ్రిల్లింగ్/చిల్లింగ్' కథలు రూపొందాయి. వారికి బహు కృతజ్ఞతలు.
ఈ సంకలనంలోని 65 కథలూ హారర్ కథారచన ప్రక్రియలోని భిన్నమైన రకాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వీటిలో కొన్ని సైన్స్ ఫిక్షన్ హారర్ కథలు అయితే మరికొన్ని పారా నార్మల్ కథలు. దయ్యాలు, భూతాలు, మాయామంత్రాల కథలున్నాయి. గోటెస్క్ హారర్ కథలున్నాయి. సర్వైవల్ హారర్ కథలున్నాయి. సైకలాజికల్ హారర్ కథలు, ఫాంటాస్టిక్...............
వెల్కమ్ టు థ్రిల్లింగ్ - చిల్లింగ్ స్టోరీ... వందేళ్ల తెలుగు కథా సాహిత్య చరిత్రలో భయానక కథల తొలి సంపుటి 'ఆ అరగంట చాలు' ప్రచురణ తరువాత పాఠకుల ప్రతిస్పందన ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఉత్తమస్థాయి కథలను పాఠకులు తప్పనిసరిగా ఆదరిస్తారన్న నా విశ్వాసం మరింత బలపడింది. అయితే, హారర్ కథలు తెలుగులో లేని సమయంలో ఓ పది పదిహేను కథలు రాసేసి సంతృప్తిపడటం కష్టం. ప్రపంచ సాహిత్యంలో హారర్ కథలు ఓ మహావృక్షంలా ఎదిగాయి. దాదాపుగా 50 పైన విభిన్నమైన రకాల హారర్ కథలు ఉన్నాయి. వీటిలో ఒకోరకం ఒకో వృక్షంలా ఎదిగింది. ఉదాహరణకు, 'సైన్స్ ఫిక్షన్ హారర్' అన్నది హారర్ కథలలో ఒక రకమైతే, సైన్స్ఫక్షన్ హారర్ పదిహేను విభిన్నమైన రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకో రకంలో దాదాపుగా యాభై పైగా భిన్నమైన సైన్స్ ఫిక్షన్ హారర్ కథలున్నాయి. అంటే, తెలుగు సాహిత్యంలో పెద్దలు, విమర్శకులు రాయకూడనివిగా పరిగణించి, చిన్నచూపు చూసి, పట్టించుకోని హారర్ కథ ప్రపంచ సాహిత్యంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని, అస్తిత్వాన్ని కలిగి ఉందన్నమాట. హారర్ సాహిత్య విశ్లేషణ సాహిత్య విమర్శ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును కలిగి ఉంది. అలాంటప్పుడు తెలుగు పాఠకులకు ఓ పదిహేను కథలను పరిచయం చేసేసి సంతృప్తిపడటం కుదరని పని. అందుకని, హారర్ ప్రపంచంలోని విభిన్న శాఖలకు ప్రాతినిధ్యం వహించే విభిన్నమైన కథలను సృజించి వారం వారం పాఠకులకు ఉర్రూతలూగించే థ్రిల్లింగ్/చిల్లింగ్ కథలను అందిస్తానని ప్రతిపాదన చేసినపుడు 'వార్త' సంపాదకులు సాయిబాబాగారు, ఆదివారం ఇన్చార్జి శ్యామలగారు వెంటనే ఆమోదించారు. కథా రచనలో సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చారు. ఫలితంగా 'థ్రిల్లింగ్/చిల్లింగ్' కథలు రూపొందాయి. వారికి బహు కృతజ్ఞతలు. ఈ సంకలనంలోని 65 కథలూ హారర్ కథారచన ప్రక్రియలోని భిన్నమైన రకాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వీటిలో కొన్ని సైన్స్ ఫిక్షన్ హారర్ కథలు అయితే మరికొన్ని పారా నార్మల్ కథలు. దయ్యాలు, భూతాలు, మాయామంత్రాల కథలున్నాయి. గోటెస్క్ హారర్ కథలున్నాయి. సర్వైవల్ హారర్ కథలున్నాయి. సైకలాజికల్ హారర్ కథలు, ఫాంటాస్టిక్...............© 2017,www.logili.com All Rights Reserved.