ఆత్మాసాక్షాత్కారం పొందిన మహాత్ముల స్థితి ఎట్లా ఉంటుందో, తక్కినవారు గ్రహించలేరు. వారి జీవితపు నడక పద్ధతి కూడా భేదంగా ఉంటుంది. అంతేకాదు, ఆ జ్ఞానులలోనే, ఒకరి జీవిత పద్ధతీ, వారు భోదించే సాధనా పద్ధతీ ఒకరినుంచి ఇంకొకరికి వేరుగా ఉంటాయి. వారిలో కొందరు మనుష్యుల మధ్య ఉండిపోయి, ఆశ్రమాలలో నివసించి, శిష్యుల్ని తయారు చేస్తారు. కొందరు నిలకడ లేకుండా తిరుగుతూ ఉంటారు. కొందరు పాడతారు. కొందరు వాదిస్తారు, కొందరు భోదిస్తారు. కొందరు మౌనులు. కొందరసలు కంటికి కనపడరు. కొందరు రొష్టుపడి, ప్రజల ఆగ్రహం వల్ల కంటక బడతారు. కాని వారికి కంటకం అంటదు. ఒకేమాట మాట్లాడి, ఒకే చర్య చూపినవారే కొందరు పూజనీయులై, చివరివరకు మన్ననలందుకుంటారు. కొందరు నిందపడతారు. విచక్షణతో చూస్తే ఈ విభేదమంతా వారు వారు కల్పించుకున్నది కాదనీ, వారి మాటల, చేతల, ప్రోద్భలమంతా ఈశ్వర చోదితమని తెలుస్తుంది.

© 2017,www.logili.com All Rights Reserved.