ప్రస్తుత అధ్యయనం, హెచ్.ఇ.హెచ్. నిజాం రాష్ట్రం లోని తూర్పు డివిజన్, లేక వరంగల్ సుభా' సామాజిక, ఆర్థిక అభివృద్ధిని 1911 నుండి 1950 వరకు వివరించటానికి ఉద్దేశించబడింది. దీనిలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్లోనే మూడు జిల్లాలున్నాయి. 1929 నుండి 1937 వరకు నిజామాబాద్ జిల్లా కూడా ఈ సుబాలో భాగంగా ఉన్నప్పటికీ, ఈ అధ్యయన పరిధి లోనికి దానిని తీసుకోవడం లేదు. కారణం, అది కొద్ది కాలం వరకు, అది కూడా మధ్యలో మాత్రమే ఉండడం'. సుబాకు ఉత్తరాన బీరార్, మధ్యపరగణాలు, తూర్పున ప్రాణహిత, గోదావరి నదులు, మదరాస్ ప్రెసిడెన్సీలో భాగమైన గోదావరి జిల్లా, దక్షిణాన కృష్ణానది, మదరాస్ ప్రెసిడెన్సీలో భాగమైన కృష్ణా జిల్లా, పశ్చిమాన నిజాం రాష్ట్రంలోని నిజామాబాద్, మెదక్, ఆత్రాఫ్-ఇ-బల్గా, మహబూబ్నగర్ జిల్లాలు ఎల్లలుగా ఉన్నాయి. కమీషనర్ హెడ్క్వార్టర్స్ హన్మకొండలో ఉంది. ఇది నిజామ్ రాష్ట్ర రైల్వేకు చెందిన కాజీపేట, వరంగల్ స్టేషన్ల మధ్య ఉంది. ఇంకా, ఇది హైదరాబాద్ నగరానికి ఈశాన్యంగా 84మైళ్ల దూరంలో ఉండి, ఎంతో వాణిజ్యపరమైన, చారిత్రక ప్రాధాన్యతను కల్గిన పట్టణంగా స్థానాన్ని పొందడం జరిగింది. ఈ సుబా ప్రాంతంలో 11 డివిజన్లు, 25 తాలూకాలు, 4,842 గ్రామాలుండగా, వీటిలో 4,036 దివానీ, 29 సర్ఫేఖాస్', 777 జాగీర్ గ్రామాలు, లేక ప్రదేశాలుగా ఉన్నాయి. ఈ అధ్యయనంలో నిజాం జాగీర్ భూముల ఆర్థిక విషయాల పరిశీలన చేపట్టడం జరిగింది. కారణం, ఆ విధంగా పూర్తి ఆర్థిక చిత్రం ముందుకు రావడం జరుగుతుంది. ఈ అధ్యయన కాలం, చివరి, లేక ఏడో నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పూర్తి పాలనా కాలాన్ని (1911-1948) ఇముడ్చుకొని వుంది. ఆ విధంగా, సుబా ఆర్థిక, సామాజిక పరిస్థితులు పరిశీలన, అదే సమయంలో రాష్ట్రం మొత్తం లోని పరిస్థితులను కూడా ప్రజ్వలింపజేస్తుంది.
ఈ సుబాకు వరంగల్ పేరు పెట్టబడింది. అట్టి వరంగల్కు 12వ శతాబ్ది చివరి పాదాన్నుండి ఘనమైన చరిత్ర ఉంది. దీని కాకతీయ పాలకులు, తూర్పు, మధ్య దక్కన్ పై తమ ఆధిపత్యాన్ని స్థాపించి, దాన్ని రెండు శతాబ్దాలకు పైగా, అంటే క్రీ.శ. 1323 వరకు........................
అధ్యాయం-I పరిచయం ప్రస్తుత అధ్యయనం, హెచ్.ఇ.హెచ్. నిజాం రాష్ట్రం లోని తూర్పు డివిజన్, లేక వరంగల్ సుభా' సామాజిక, ఆర్థిక అభివృద్ధిని 1911 నుండి 1950 వరకు వివరించటానికి ఉద్దేశించబడింది. దీనిలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్లోనే మూడు జిల్లాలున్నాయి. 1929 నుండి 1937 వరకు నిజామాబాద్ జిల్లా కూడా ఈ సుబాలో భాగంగా ఉన్నప్పటికీ, ఈ అధ్యయన పరిధి లోనికి దానిని తీసుకోవడం లేదు. కారణం, అది కొద్ది కాలం వరకు, అది కూడా మధ్యలో మాత్రమే ఉండడం'. సుబాకు ఉత్తరాన బీరార్, మధ్యపరగణాలు, తూర్పున ప్రాణహిత, గోదావరి నదులు, మదరాస్ ప్రెసిడెన్సీలో భాగమైన గోదావరి జిల్లా, దక్షిణాన కృష్ణానది, మదరాస్ ప్రెసిడెన్సీలో భాగమైన కృష్ణా జిల్లా, పశ్చిమాన నిజాం రాష్ట్రంలోని నిజామాబాద్, మెదక్, ఆత్రాఫ్-ఇ-బల్గా, మహబూబ్నగర్ జిల్లాలు ఎల్లలుగా ఉన్నాయి. కమీషనర్ హెడ్క్వార్టర్స్ హన్మకొండలో ఉంది. ఇది నిజామ్ రాష్ట్ర రైల్వేకు చెందిన కాజీపేట, వరంగల్ స్టేషన్ల మధ్య ఉంది. ఇంకా, ఇది హైదరాబాద్ నగరానికి ఈశాన్యంగా 84మైళ్ల దూరంలో ఉండి, ఎంతో వాణిజ్యపరమైన, చారిత్రక ప్రాధాన్యతను కల్గిన పట్టణంగా స్థానాన్ని పొందడం జరిగింది. ఈ సుబా ప్రాంతంలో 11 డివిజన్లు, 25 తాలూకాలు, 4,842 గ్రామాలుండగా, వీటిలో 4,036 దివానీ, 29 సర్ఫేఖాస్', 777 జాగీర్ గ్రామాలు, లేక ప్రదేశాలుగా ఉన్నాయి. ఈ అధ్యయనంలో నిజాం జాగీర్ భూముల ఆర్థిక విషయాల పరిశీలన చేపట్టడం జరిగింది. కారణం, ఆ విధంగా పూర్తి ఆర్థిక చిత్రం ముందుకు రావడం జరుగుతుంది. ఈ అధ్యయన కాలం, చివరి, లేక ఏడో నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పూర్తి పాలనా కాలాన్ని (1911-1948) ఇముడ్చుకొని వుంది. ఆ విధంగా, సుబా ఆర్థిక, సామాజిక పరిస్థితులు పరిశీలన, అదే సమయంలో రాష్ట్రం మొత్తం లోని పరిస్థితులను కూడా ప్రజ్వలింపజేస్తుంది. ఈ సుబాకు వరంగల్ పేరు పెట్టబడింది. అట్టి వరంగల్కు 12వ శతాబ్ది చివరి పాదాన్నుండి ఘనమైన చరిత్ర ఉంది. దీని కాకతీయ పాలకులు, తూర్పు, మధ్య దక్కన్ పై తమ ఆధిపత్యాన్ని స్థాపించి, దాన్ని రెండు శతాబ్దాలకు పైగా, అంటే క్రీ.శ. 1323 వరకు........................© 2017,www.logili.com All Rights Reserved.