ఆచార్య డా॥ గాజులపల్లి రామచంద్రారెడ్డి గారు భారతదేశం స్వాతంత్ర్యం పొందుటకు సరిగ్గా రెండు సంవత్సరాల పూర్వం అనగా 1945 ఆగస్టు 15వ తేదీన దక్షిణకాశిగా పేరొందిన పుష్పగిరి మహాక్షేత్రానికి సమీపంలో ఉండే వైఎస్సార్ కడప జిల్లా, చెన్నూరు మండలం, ఉప్పరపలె గామంలో జన్మించారు. విద్యాభ్యాసం స్వగ్రామం, కడప, చిత్తూరు, అనంతపురంలో జరిగింది. 1986వ సంవత్సరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టాను పొందారు. 1996వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపకుడుగా ఎంపిక కాబడ్డారు.
1971వ సంవత్సరం ఎం.ఏ(తెలుగు)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వెంటనే మద్రాసు పచ్చయప్ప కళాశాలలో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేశారు. తర్వాత 1974వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో లెక్చరరుగా చేరి 1977వ సంవత్సరం విజయవాడ SRR & CVR ప్రభుత్వ కళాశాలకు బదిలీపై వచ్చి 2003లో పదవీ విరమణ చేశారు. రచనా వ్యాసంగంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ అందరికీ ఆప్తులుగా, హితులుగా, సన్నిహితులుగా మార్గదర్శిగా మన్ననలను పొందుచున్నారు.
ఈయనకు ఒక కుమారుడు, కుమార్తె. ఇరువురూ డాక్టర్లు. వారు అమెరికా పౌరసత్వాన్ని పొంది వారి కుటుంబాలతో అక్కడే స్థిరపడ్డారు. 10
ఆచార్య రామచంద్రారెడ్డి గారు "వచన కవిత - ఆవిర్భావ వికాసాలు" అను తన సిద్ధాంత గ్రంథములతో పాటు సుమారు 15 గ్రంథాలను రచించారు. అందులో ముఖ్యమైనవి.
1. పిల్లల పెంపకంలో రూపశిల్పులు తల్లిదండ్రులు - గురువులు
2. విద్యార్థుల విజయసోపానము
3.విద్యార్థులు చదువు - సంస్కారం
4. వైయస్సార్ ప్రజా సుపరిపాలన-మానవీయత
5. మరువలేని మహానేత డా॥ వై.యస్.రాజశేఖరరెడ్డి
6. ఆంగ్లభాషలో విద్యాబోధన (అనుబంధాలకు అమ్మభాష అవసరాలకు ఆంగ్లభాష)
7. భావితరాల భవిత మూడు రాజధానులు.
సాహిత్యంతో పాటు సామాజిక రాజకీయ అంశాలపై వివిధ పత్రికలలో వ్యాసాలు వ్రాస్తూ, ఆకాశవాణిలో ప్రోగ్రామ్ లు ఇస్తూ ఉంటారు
ఆచార్య డా॥ గాజులపల్లి రామచంద్రారెడ్డి గారు భారతదేశం స్వాతంత్ర్యం పొందుటకు సరిగ్గా రెండు సంవత్సరాల పూర్వం అనగా 1945 ఆగస్టు 15వ తేదీన దక్షిణకాశిగా పేరొందిన పుష్పగిరి మహాక్షేత్రానికి సమీపంలో ఉండే వైఎస్సార్ కడప జిల్లా, చెన్నూరు మండలం, ఉప్పరపలె గామంలో జన్మించారు. విద్యాభ్యాసం స్వగ్రామం, కడప, చిత్తూరు, అనంతపురంలో జరిగింది. 1986వ సంవత్సరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టాను పొందారు. 1996వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపకుడుగా ఎంపిక కాబడ్డారు. 1971వ సంవత్సరం ఎం.ఏ(తెలుగు)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వెంటనే మద్రాసు పచ్చయప్ప కళాశాలలో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేశారు. తర్వాత 1974వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో లెక్చరరుగా చేరి 1977వ సంవత్సరం విజయవాడ SRR & CVR ప్రభుత్వ కళాశాలకు బదిలీపై వచ్చి 2003లో పదవీ విరమణ చేశారు. రచనా వ్యాసంగంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ అందరికీ ఆప్తులుగా, హితులుగా, సన్నిహితులుగా మార్గదర్శిగా మన్ననలను పొందుచున్నారు. ఈయనకు ఒక కుమారుడు, కుమార్తె. ఇరువురూ డాక్టర్లు. వారు అమెరికా పౌరసత్వాన్ని పొంది వారి కుటుంబాలతో అక్కడే స్థిరపడ్డారు. 10 ఆచార్య రామచంద్రారెడ్డి గారు "వచన కవిత - ఆవిర్భావ వికాసాలు" అను తన సిద్ధాంత గ్రంథములతో పాటు సుమారు 15 గ్రంథాలను రచించారు. అందులో ముఖ్యమైనవి. 1. పిల్లల పెంపకంలో రూపశిల్పులు తల్లిదండ్రులు - గురువులు 2. విద్యార్థుల విజయసోపానము3.విద్యార్థులు చదువు - సంస్కారం 4. వైయస్సార్ ప్రజా సుపరిపాలన-మానవీయత5. మరువలేని మహానేత డా॥ వై.యస్.రాజశేఖరరెడ్డి 6. ఆంగ్లభాషలో విద్యాబోధన (అనుబంధాలకు అమ్మభాష అవసరాలకు ఆంగ్లభాష) 7. భావితరాల భవిత మూడు రాజధానులు. సాహిత్యంతో పాటు సామాజిక రాజకీయ అంశాలపై వివిధ పత్రికలలో వ్యాసాలు వ్రాస్తూ, ఆకాశవాణిలో ప్రోగ్రామ్ లు ఇస్తూ ఉంటారు© 2017,www.logili.com All Rights Reserved.