అమ్మ గాజులు
గాజుల్లేని అమ్మ చేతుల్ని చూస్తున్నప్పుడల్లా
చుక్కలేని బోసి ఆకాశమే కనబడుతూంది
పూలు లేని మొండి కొమ్మలు
కంటి ముందు కన్నీళ్లై కదులుతుంటాయి
చిన్నప్పుడు జోకొట్టి
నిదురపుచ్చుతున్నప్పుడూ
కాళ్ళ మీద పడుకోపెట్టి
స్నానం చేయిస్తున్నప్పుడూ
అక్కున అదుముకొని
తల నిమురుతూ పాలు తాగిస్తున్నప్పుడూ
అవ్యక్త మధురంగా మోగిన గాజులు
నాలో ఇంకా నినదిస్తూనే ఉన్నాయి
కోపంతో నాన్న కొట్టినప్పుడు
గుచ్చుకొని గాయాలైన అమ్మచేతులు
నాకిప్పటికీ గుర్తున్నాయి
కారం దంచుతున్నప్పుడు
కట్టెలు కొడుతున్నపుడు........................
© 2017,www.logili.com All Rights Reserved.